Viral: ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్వాకాన్ని సీక్రెట్‌గా రికార్డు చేసిన ప్యాసెంజర్! వీడియో వైరల్
ABN, Publish Date - Apr 23 , 2024 | 08:00 PM
లగేజీ తరలింపులో ఎయిర్ ఇండియా సిబ్బంది అశ్రద్ధను వీడియోతో సహా రుజువు చేసిన ఓ ప్రయాణికుడు సంస్థ యాజమాన్యంపై మండిపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: లగేజీ తరలింపులో (Luggage Handling) ఎయిర్ ఇండియా సిబ్బంది (Air India Ground Staff) అశ్రద్ధను వీడియోతో సహా రుజువు చేసిన ఓ ప్రయాణికుడు సంస్థ యాజమాన్యంపై మండిపడ్డాడు. ఎంతో నమ్మకం పెట్టుకుంటే ఇలా చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడు షేర్ చేసిన వీడియో వైరల్ (Viral) కావడంతో దాదాపు కోటి నలభై లక్షలవరకూ వ్యూస్ వచ్చాయి. ఇషావర్ ద్వివేదీ అనే ప్రయాణికుడు ఈ వీడియోను షేర్ చేశాడు.
Viral: తొలిసారి భారతీయ బార్బర్‌తో మసాజ్ చేయించుకున్న అమెరికన్! చివరకు ఏమైందో మీరే చూడండి!
తన సంగీత వాయిద్యాన్ని మరో వాహనంలోకి పెట్టేసమయంలో సిబ్బంది దాన్ని వాహనంలోకి విసిరేయడాన్ని ప్రయాణికుడు రికార్డు చేసి నెట్టింట పంచుకున్నాడు (Throw musical instrument). సంగీత వాయిద్యం విషయంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ వీడియోను బాగా షేర్ చేయడండి. ఎయిర్ ఇండియాను నిలదీయండి’’ అంటూ అతడు నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు. సులువుగా పాడయ్యే ఓ పరికరాన్ని ఇలా హ్యాండిల్ చేస్తారా అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాను కూడా ట్యాగ్ చేశాడు.
వీడియో చూసిన అనేక మంది ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు గుప్పించారు. లగేజీ విషయంలో సంస్థ అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. రోజంతా లగేజీ మోసే సిబ్బంది ఒక్కోసారి అలసటకు లోనై ఇలా చేసే అవకాశం ఉందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు.
Read Latest Offbeat and Telugu News
Updated Date - Apr 23 , 2024 | 08:04 PM