Viral: భారతీయ మగాళ్లను ఎంత మాట అనేశాడు.. అమెరికన్ షాకింగ్ కామెంట్స్ వైరల్
ABN, Publish Date - Aug 30 , 2024 | 07:36 AM
భారతీయ పురుషులపై ఓ అమెరికన్ వ్యక్తీకరించిన అభిప్రాయం తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు అతడితో ఏకీభవిస్తే మరికొందరు మాత్రం విభేదిస్తున్నారు. ఎంత మాట అనేశాడు అంటూ వాపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ పురుషులపై ఓ అమెరికన్ వ్యక్తీకరించిన అభిప్రాయం తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొందరు అతడితో ఏకీభవిస్తే మరికొందరు మాత్రం విభేదిస్తున్నారు. ఎంత మాట అనేశాడు అంటూ వాపోతున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో (Viral) కొనసాగుతోంది.
Viral: ఈమె భర్త కొంప ముంచేస్తోందిగా! ఇలాగేతై అతడి పరిస్థితి అధోగతే! షాకింగ్ వీడియో!
చాలా కాలంగా భారత్‌లో ఉంటున్న అమెరికా పౌరుడు జాన్ భారతీయ పురుషులపై తన అభిప్రాయాన్ని తాజా వీడియోలో కుండబద్దలు కొట్టాడు. ఇక్కడి పురుషులు లెక్చర్లు దంచడంలో సిద్ధహస్తులని, అకారణంగా సంభాషణను సాగదీస్తూ ఊకదంపుతారని కామెంట్ చేశాడు. కొన్నాళ్లుగా భారత్‌లో ఉంటున్న తనకు ఈ అభిప్రాయం కలిగిందని చెప్పుకొచ్చాడు. ఓ భారతీయ మహిళ కూడా తన అభిప్రాయంతో ఏకీభవిస్తూ తన భర్తకు ఇదే సూచనన తన ముందే చేసిందని చెప్పాడు. భార్య అలా అనేసరికి అతడు షాకైపోయాడని కూడా పేర్కొన్నాడు (American Mans Observation Of Indian Male Behaviour goes viral).
‘‘నేను చాలా కాలంగా ఇండియాలో ఉంటున్నాను. ఇక్కడి వారిని చూశాక అర్థమైందేంటంటే.. భారతీయ పురుషులు లెక్చర్లు దంచడంలో ముందుంటారు. నేను ఒక్క మాట అనగానే వారు దాదాపు ముప్ఫై నిమిషాల పాటు ఆ అంశంపై పెద్ద ఉపన్యాసమే ఇస్తారు. నేను పెద్దగా ఏమీ అనకపోయినా, నా తప్పు ఏమీ లేకపోయినా నాకీ లెక్చర్లు తప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో తమకు అవగాహన లేని అంశాలపై కూడా భారతీయ మగాళ్లు లెక్చర్లు దంచుతుంటారు. ఉదాహరణకు అమెరికన్ కల్చర్ గురించి నేను ఏదైనా చెబితే వారు దానిపై నాకే పెద్ద ఉపన్యాసం ఇచ్చేస్తారు. ఓసారి ఓ మహిళ నా ఎదురుగానే తన భర్తకు క్లాస్ తీసుకుంది. ‘నువ్వు జాన్ మాట వినాలి. అప్పుడే ఏదోకటి నేర్చుకోగలవు’ అని ఆమె అనడంతో భర్త క్షణకాలం పాటు తత్తరపాటుకు గురయ్యాడు. అసలు అవతలివారి మాట వినాలన్న విషయమే వింత అన్నట్టు మొహం పెట్టాడు’’ అని అతడు చెప్పాడు.
ఈ వీడియో సహజనంగానే నెట్టింట తెగ వైరల్ అయ్యింది. లెక్కకుమిక్కిలి వ్యూస్, వేలకొద్దీ కామెంట్స్ వచ్చిపడ్డాయి. కొందరు జాన్ అభిప్రాయంతో ఏకీభవించారు. ‘‘మహిళలు తమతో ఏకీభవించకపోతే భారతీయ పురుషులు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరూ నాకు చెప్పలేదు..నన్ను సిద్ధం చేయలేదు’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మేము జనాలకు లెక్చర్లు దంచడంలో ముందుంటాం కానీ వాటిని మా జీవితాల్లోకి మాత్రం అన్వయించాలని భావించము’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘‘ఇంట్లోని సహాయకులు కూడా ఓనర్లకు లెక్చర్లు, పాఠాలు చెబుతుంటారు’’ అని మరో వ్యక్తి తెలిపారు. ‘‘సామాజిక నైపుణ్యాలను పిల్లలకు పాఠశాలల్లో బోధించరు. చాలా సందర్భాల్లో మాట్లాడడం కంటే వినడం బెటరని ఎవరూ వారికి చెప్పరు. అంతేకాకుండా, లెక్చర్లు దంచితే తాము మేధావులుగా కనబడతామని కొందరు భావిస్తారు’’ అని మరో నెటిజన్ అన్నారు. ఇలా భారతీయులందరినీ ఒకేగాటన కట్టడం సబబు కాదని కొందరు విమర్శించారు. ఎంత మాట అనేశాడంటూ నోరునొక్కుకున్నారు.
Updated Date - Aug 30 , 2024 | 07:40 AM