ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!

ABN, Publish Date - Oct 03 , 2024 | 09:55 AM

గెద్ద వీడియో షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. లక్ష్యంపై నుంచి దృష్టి మళ్లకుండా ఎలా ముందుకు సాగాలో ఆయన చెప్పిన విషయాలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: స్ఫూర్తివంతమైన కథనాలు నెట్టింట పంచుకునే ప్రముఖుల్లో ఆనంద్ మహీంద్రా ముందుంటారు. ఆయన ట్వీట్స్ తన ఫాలోవర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అవి రోజుల తరబడి ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. గెద్ద వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా చెప్పిన విషయాలు ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతున్నాయి.

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..


ఏకాగ్రత, లక్ష్యంపై చెదరని దృష్టి ఎంత అవసరమో చెబుతూ ఆనంద్ మహీంద్రా తాజాగా ట్వీట్ చేశారు. దీనికి ఓ గెద్ద వీడియోను కూడా జత చేశారు. ఆ గెద్ద తన లక్ష్యం వైపు తదేకంగా చూస్తూ కనిపించింది. తదుపరి దేన్ని వేటాడాలనే విషయంపై నుంచి దృష్టి మరల్చకుండా చూస్తుంది. వేటాడేందుకు అనువైన జంతువు ఏదో దీక్షగా పరిశీలించింది. పరిసరాలన్నిటినీ జాగ్రత్తగా గమనించింది. ఆ చూపులోని తీక్షణత, పట్టుదల కొట్టొచ్చినట్టు కనిపించింది.

Viral: వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా?

ఈ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక జమానాలో ఏకాగ్రత సాధించడం కష్టమైన అంశంగా మారిపోయిందని ఆయన అన్నారు. మనసుల్ని పక్కదోవ పట్టించే అంశాలు ఎన్నో ఉన్నాయని హెచ్చరించారు. అయితే, ఈ గోలలో పడి ఏకాగ్రత చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా లక్ష్యంపైనే దృష్టి నిలపాలని, రాజీపడకుండా ప్రయాణం కొనసాగించాలని సూచించారు.


UP: క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్ ఆర్డర్! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక..

స్ఫూర్తి రగిలించేలా ఉన్న గెద్ద చూపులకు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన నిర్వచనం అనేక మందిలో ఉత్సాహం నింపింది. దీంతో, ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. ఏకాగ్రత సాధించాలంటే అన్నింటికీ దూరంగా ఉండనక్కర్లేదని, అనవసర అంశాలు మనసును తాకకుండా జల్లెడపట్టగలిగితే అద్భుతాలు సాధించవచ్చని చెప్పుకొచ్చారు.

Viral: అచేతనంగా పుట్టిన శిశువును ఈ డాక్టర్ ఎలా బతికించారో చూస్తే..

చేస్తున్న పనిపై నుంచి దృష్టి మళ్లించే అంశాలను మనోనిగ్రహం సాధించేందుకు అవకాశాలుగా చూడాలని కొందరు అభిప్రాయపడ్డారు. నేటి జమానాలో అక్కరకు వచ్చే ముఖ్యమైన నైపుణ్యాల్లో ఇదీ ఒకటని చెప్పుకొచ్చారు. నిరంతర సాధనతో మనసుకు నిలకడ తీసుకురావొచ్చని అన్నారు. ఇక కొందరు మాత్రం స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లపై నెపం నెట్టారు. వీటి వల్లే అధిక శాతం మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని వాపోయారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.

Viral: కుందేలు, తాబేలు మధ్య పరుగు పదెం.. చివరికి ఏమైందో చూస్తే..

Read Latest and Viral News

Updated Date - Oct 03 , 2024 | 10:05 AM