ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Anand Mahindra: ఫొటోకు ఫన్నీ క్యాప్షన్ అడిగిన ఆనంద్ మహీంద్రా.. విజేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..!

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:48 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపారకార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కొంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వాటిని తన ఫాలోవర్లతో పంచుకుంటారు. అప్పుడప్పుడు ఫన్నీ పోస్ట్‌లు కూడా చేస్తుంటారు.

Indognito Mode

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన వ్యాపారకార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కొంత సమయం కేటాయిస్తారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వాటిని తన ఫాలోవర్లతో పంచుకుంటారు. అప్పుడప్పుడు ఫన్నీ పోస్ట్‌లు కూడా చేస్తుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ ఫన్నీ కాంపిటీషన్ నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతి కూడా ప్రకటించారు. ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Funny caption for Photo).


ఈ నెల 1వ తేదీన ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో ఓ కుక్క (Dog) ఫొటోను పోస్ట్ చేశారు. ఇనుప రెయిలింగ్ వెనుక కూర్చున్న ఓ కుక్క తన మొహాన్ని కరెక్ట్‌గా ఓ ఆకృతి దగ్గర పెట్టింది. ఆ ఫొటోను పోస్ట్ చేసిన ఆనంద్.. దానికి సరైన ఫన్నీ క్యాప్షన్ పంపించాలని కోరారు. జూన్ 3వ తేదీ వరకు టైమ్ ఇచ్చారు. వచ్చిన వాటిల్లో తనకు నచ్చిన క్యాప్షన్ పంపించిన వారికి ఓ క్రియేటివ్ గిఫ్ట్ కూడా ఇస్తానని ప్రకటించారు. అలా వచ్చిన వాటిల్లో ఓ క్యాప్షన్‌ను ఎంపిక చేశారు. ఆ ఫొటోకు ``ఇన్‌కాగ్నిటో మోడ్`` తరహాలో ``ఇన్‌డాగ్నిటో మోడ్`` (Indognito Mode) అని ఓ వ్యక్తి క్యాప్షన్ ఇచ్చాడు.


@raptorsworld అనే ట్విటర్ హ్యాండిల్‌ నుంచి వచ్చిన ఆ క్యాప్షన్ ఆనంద్ మహీంద్రాకు చాలా నచ్చింది. దీంతో స్కేల్ మోడల్ మహీంద్రా ఫ్యూరియో ట్రక్‌‌ను బహుమతిగా ప్రకటించారు. ఆ బహుమతిని పంపించడానికి చిరునామా వివరాలు పంపించాల్సిందిగా విజేతను కోరారు. తన ఫాలోవర్ల సృజనాత్మక సామర్థ్యాన్ని హైలైట్ చేయడమే కాకుండా, వారితో బలమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆనంద్ మహీంద్రా చేస్తున్న ప్రయత్నాలను అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ ఫొటోలో విభిన్నమైన జంట ఏదో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!


Viral video: ఆ సింహాలకు ఎంత అవమానం?.. రోడ్డు మీద పడుక్కున్న రెండు సింహాల మధ్య నుంచి ఎలా వెళ్లాడో చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2024 | 11:48 AM

Advertising
Advertising