ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: విదేశీ కార్లు వాడుతున్నారంటూ ప్రచారం.. ఆనంద్‌ మహీంద్రా వివరణ

ABN, Publish Date - Sep 03 , 2024 | 11:02 AM

ప్రతి సోమవారం స్ఫూర్తివంతమైన కథనాలు పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తనపై దుష్ప్రచారం జరుగుతుండటంతో వివరణ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఓ సోషల్ మీడియా యూజర్ చేసిన ప్రచారంపై ఆయన స్పందించాల్సి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి సోమవారం స్ఫూర్తివంతమైన కథనాలు పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తనపై దుష్ప్రచారం జరుగుతుండటంతో వివరణ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Viral). ఓ సోషల్ మీడియా యూజర్ చేసిన ప్రచారంపై ఆయన స్పందించాల్సి వచ్చింది. మహీంద్రా కార్లతో తనకున్న అనుబంధం ఎలాంటిదో వివరిస్తూ ఆయన ఈ పోస్టు పెట్టారు.

Viral: వామ్మో! రోజుకు అరగంటే నిద్రపోతున్న వ్యక్తి! 12 ఏళ్లుగా ఇదే తీరు!


ఆటోమొబైల్ రంగం ఔత్సాహికుడిగా చెప్పుకునే రతన్ ధిల్లాన్ ఇటీవల నెట్టింట ఓ సంచలన పోస్టు పెట్టారు. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ఆనంద్ మహీంద్రాకు ఉన్న నిబద్ధతను బహిరంగంగా ప్రశించారు. ఆనంద్ మహీంద్రా వద్ద విదేశీ లగ్జరీ కార్లు ఉన్నాయంటూ ఫొటోలు కూడా షేర్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడాలనే ఆయన తన సొంత బ్రాండైన మహీంద్రా థార్ కారుకు బదులు బీఎమ్‌డబ్ల్యూ, మెర్సిడీస్ కార్లను ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు.

కాగా, దీనిపై ఆటోకార్ ఇండియా ఎడిటర్ హార్మజ్ద్ సొరాబ్జీ ఘాటుగా స్పందించారు. ధిల్లాన్ చేబుతున్నవి అవాస్తవాలుగా కొట్టిపారేశారు. ‘‘ఓ ఫేక్ న్యూస్‌ను చూసి షాకైపోయా. అవాస్తవాలకు ఎంతటి ప్రచారం వస్తుందో చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. గత 30 ఏళ్లుగా ఆనంద్ మహీంద్రా తన సొంత బ్రాండ్ కార్లు మినహా మరే ఇతర వాహనాలు కొనుగోలు చేయలేదు. అలాంటి వ్యక్తి గురించిన అవాస్తవాలు సులువుగా వ్యాపిస్తున్నాయి’’ అని విచారం వ్యక్తం చేశారు.


ఇది నెట్టింట వైరల్ కావడంతో ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. తన కార్ల గురించి చెప్పుకొచ్చారు. 1991లో హిందుస్తాన్ మోటార్స్ తనకు ఇచ్చిన కాంటెస్సా కారు మొదలు రెడ్ స్కార్పియో ఎన్ వరకూ లిస్టు తెలిపారు. ‘‘నేను ఇతర విదేశీ కార్ల బ్రాండ్స్ ఏవీ కొనుగోలు చేయలేదు. నా సొంత కంపెనీలో తయారైన కార్లు వినియోగించడం నాకెంతో గర్వకారణం’’ అని అన్నారు. కాగా, ధిల్లాన్ షేర్ చేసిన ఫొటోపై కూడా స్పందించారు. మాంటెరీ కార్ వీక్‌ సందర్భంగా మహీంద్రా బటిస్టా ఎలక్ట్రిక్ హైపర్ కారును ఆవిష్కరించారని, ఆ సందర్భంలోనే ఆ ఫొటో తీశారని వివరించారు. ఇక ఫొటోలోని వింటేజ్ కారు సిసిటాలియా అని, అది మహీంద్రా బ్రాండ్ కారని చెప్పుకొచ్చారు. కాగా, ఆనంద్ మహీంద్రాపై దుష్ప్రచారాన్ని నెటిజన్లు కూడా ఖండించారు.

Read Latest and Viral News

Updated Date - Sep 03 , 2024 | 11:11 AM

Advertising
Advertising