ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈ వరుడేంటీ.. మరీ విచిత్రంగా ఉన్నాడు.. వధువు ప్రేమగా దగ్గరికొస్తే.. చివరికి ఇతను చేసిన పని ..

ABN, Publish Date - Feb 21 , 2024 | 04:11 PM

వివాహ సమయాల్లో వధూవరుల మధ్య హాస్యభరితమైన పోటీలు జరగడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో వధూవరులు ఒకరికొకరు పోటీపడి మరీ పైచేయి సాధించాలని చూస్తుంటారు. బిందెలో...

వివాహ సమయాల్లో వధూవరుల మధ్య హాస్యభరితమైన పోటీలు జరగడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో వధూవరులు ఒకరికొకరు పోటీపడి మరీ పైచేయి సాధించాలని చూస్తుంటారు. బిందెలో ఉంగరాలు తీయడం, తలంబ్రాలు చల్లుకోవడం, దండలు మార్చుకోవడం, డాన్సులు వేసే సమయాల్లో సరదా సంఘటనలు జరగడం చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ సరదాగానే సాగుతుంటాయి. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వరుడి ప్రవర్తన చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వధువు ప్రేమగా దగ్గరికి వచ్చి డాన్స్ చేయాలని చూడగా.. అతను చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు ( bride and groom) డాన్స్ చేసే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వివాహ కార్యక్రమంలో సందర్భంగా కళ్యాణ మంటపంలో వధూవరుల ఎదుట కొందరు యువతులు డాన్స్‌లు చేస్తుంటారు. తర్వాత వధువు కూడా సదరు యువతితో కలిసి డాన్స్ చేస్తుంది. ఇలా కొద్ది సేపు డాన్స్ చేశాక.. అక్కడున్న వారంతా వధూవరులను డాన్స్ చేయాల్సిందిగా బలవతం చేస్తారు. వరుడికి ఇష్టం లేకున్నా బలవంతం మీద ఒప్పుకొంటాడు. వధువు ప్రేమగా దగ్గరికి వెళ్లి వరుడిని పట్టుకుని డాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే వరుడు మాత్రం వధువు చేయిని పక్కకు తీసేందుకు ప్రయత్నిస్తాడు. వధువు మాత్రం వరుడిని గట్టిగా పట్టుకుని ఉంటుంది. దీంతో వరుడికి ఒక్కసారిగా (groom anger on bride) కోపం కట్టలు తెంచుకుంటుంది. తీవ్రమైన కోపంతో వధువును గిరగిరా తిప్పి కింద పడేస్తాడు.

Viral: వధువు కోసం ఇతడి వెతుకులాట మామూలుగా లేదుగా.. రిక్షాపై బయోడేటా రాసి మరీ..

అంతటితో ఆగని వరుడు.. కిందపడ్డ యువతిని మళ్లీ బలవంతంగా పైకి లేపి చేతులు పట్టుకుని గిరాగిరా తిప్పేందుకు ప్రయత్నిస్తాడు. వరుడి ఆవేశం చూసి అక్కడున్న వారంతా షాక్ అవుతున్నారు. ఓ యువతి వారిని విడిపించే ప్రయత్నం చేస్తుంది. అయినా వరుడు ఏమాత్రం శాంతించకుండా.. ఆమెను పట్టుకుని.. ‘‘ఇలా ఎవరైనా డాన్స్ చేస్తారా’’.. అంటూ ఆమెను కూడా ఇబ్బంది పెడతాడు. చివరకు అక్కడున్న యువకులు వరుడిని పట్టుకుని పక్కకు తీసుకెళ్తారు. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో వధువు ఏడుస్తూ ఉండిపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడేంటీ.. మరీ వాయిలెంట్‌గా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ఇది మరీ దారుణం బయ్యా’’.. అంటూ మరికొందరు, ‘‘వైరల్ కావాలనే ఉద్దేశంతో కావాలనే ఇలా చేసినట్టు అనిపిస్తోంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆహా.. ఏం వాడకమయ్యా..! ఇన్నాళ్లూ వాషింగ్ మెషిన్‌ అంటే దుస్తులు ఉతికేందుకే అనుకున్నాం.. కానీ..

Updated Date - Feb 21 , 2024 | 04:13 PM

Advertising
Advertising