iPhone 14 Plus: ఐఫోన్ 14 ప్లస్ యూజర్లకు బిగ్ అలర్ట్
ABN, Publish Date - Nov 03 , 2024 | 02:17 PM
ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే బ్యాక్ కెమెరాకు సంబంధించిన సమస్యలను రిపేర్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఐఫోన్ 14 ప్లస్ బ్యాక్ కెమెరా సమస్యలను పరిష్కరించడానికి ఒక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది.
ఐఫోన్ 14 ప్లస్ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్ వచ్చింది. ఎలాంటి కాంప్లిమెంటరీ ఛార్జీలు తీసుకోకుండానే బ్యాక్ కెమెరాకు సంబంధించిన సమస్యలను రిపేర్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఐఫోన్ 14 ప్లస్ బ్యాక్ కెమెరా సమస్యలను పరిష్కరించడానికి ఒక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్టు వెల్లడించింది. ప్రభావిత యూజర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, 12 నెలల పాటు ఈ కాంప్లిమెంటరీ రిపేర్లను పొందవచ్చని వెల్లడించింది. ఇక ఈ ప్రకటనకు ముందే రిపేర్లు చేయించుకున్నవారికి రిపేర్‌కు అయిన డబ్బులను రిఫండ్ చేస్తామని తెలిపింది. కాగా ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌లోని ఫోన్లలో మాత్రమే ఈ బ్యాక్ కెమెరా సమస్యలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
కాగా బ్యాక్ కెమెరా సమస్య ప్రధానంగా ఏప్రిల్ 10, 2023 - ఏప్రిల్ 28, 2024 మధ్య తయారైన ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లలో తలెత్తింది. బ్యాక్ కెమెరా ప్రివ్యూలను చూడడంలో సమస్యలు ఎదురయ్యాయి. కాగా ఉచిత సర్వీసును పొందాలనుకునేవారు తమ అర్హతను నిర్ధారించుకోవడానికి యూజర్లు యాపిల్ సపోర్ట్ పేజీని సందర్శించాల్సి ఉంటుంది. ఐఫోన్ సీరియల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఉచితంగా రిపేర్ అర్హతకు నిర్దిష్ట షరతులు ఉన్నాయి. వినియోగదారులు తమ ఐఫోన్ 14 ప్లస్ సీరియల్ నంబర్ సరైనదేనని నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత కెమెరా సమస్య ఉత్పన్నమైన ఫోన్లు మూడేళ్ల కంటే పాతవి కాకూడదు.
కాగా ఐఫోన్ 14 ప్లస్ యూజర్లు ఫోన్ సీరియల్ నంబర్ తెలుసుకునేందుకు సెట్టింగ్స్ యాప్‌లోకి వెళ్లాలి. జనరల్, తర్వాత అబౌట్‌ను ఎంచుకోవాలి. స్క్రీన్‌పై సీరియల్ నంబర్ కనిపిస్తుంది. ఈ నంబర్‌ను సర్వీస్ ప్రోగ్రామ్‌కు అర్హతను నిర్ధారించుకోవడానికి యాపిల్ వెబ్‌సైట్‌లో ఉపయోగించవచ్చు.
Updated Date - Nov 03 , 2024 | 02:17 PM