Weight Loss: ఈ వేసవిలో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఫిట్‌నెస్ కోచ్ చెప్పిన సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే..
ABN, Publish Date - Mar 16 , 2024 | 08:05 AM
అమెరికాకు చెందిన ఫిట్‌నెస్ కోచ్ జెన్నా రిజ్జో ఈ వేసవిలో బరువు తగ్గడానికి మూడు సింపుల్ టెక్నిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆమె టెక్నిక్స్ ద్వారా నెమ్మదిగా, ఆరోగ్యకరంగా, చాలా ఉత్సాహంగా బరువు తగ్గవచ్చు.
మిగిలిన కాలాలతో పోల్చుకుంటే వేసవిలో (Summer) బరువు తగ్గడం కాస్త సులభం. వ్యాయామం, డైటింగ్ ప్లాన్ పక్కాగా ఉంటే చాలా ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు (Weight Loss). అమెరికాకు చెందిన ఫిట్‌నెస్ కోచ్ జెన్నా రిజ్జో ఈ వేసవిలో బరువు తగ్గడానికి మూడు సింపుల్ టెక్నిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆమె టెక్నిక్స్ ద్వారా నెమ్మదిగా, ఆరోగ్యకరంగా, చాలా ఉత్సాహంగా బరువు తగ్గవచ్చు (Weight Loss tips). ఆమె చెప్పిన మూడు టిప్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం (Fitness coach tips)..
1)జిమ్‌లో ఒంటరిగా కార్డియో ఎక్సర్‌సైజ్‌లు లేదా ఏదో ఒక భాగాన్ని టార్గెట్ చేసుకుని చేసే వ్యాయామాలు కాకుండా ఉదయాన్నే ఏదైనా గేమ్ ఆడండి. బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి టీమ్ స్పోర్ట్స్ ఆడండి. ఉల్లాసంగా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు విడుదలయ్యే హార్మోన్ల కారణంగా బరువు తగ్గవచ్చు.
2) మీకు నచ్చిన ఆహారాన్నే కొద్ది కొద్దిగా తినండి. హెల్దీ ఫుడ్స్ కోసం వెంపర్లాడకండి. డైట్ ప్లాన్ ఏదైనా సుదీర్ఘ కాలం పాటించేదిగా ఉండాలి. నిజానికి హెల్దీ ఫుడ్స్‌గా భావించే స్మూతీలు, యోగర్ట్‌లు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. తరచుగా తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ.
3)ప్రతిరోజూ కచ్చితంగా 7 గంటల పాటు నిద్రపొండి. తగినంత నిద్ర కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. మెటబాలిజమ్ మీకు వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా పని చేస్తుంది. నిద్రపోవడానికి రెండు గంటల ముందు రోజులో మీ చివరి భోజనాన్ని పూర్తి చేయాలి.
Updated Date - Mar 16 , 2024 | 08:05 AM