ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పైల్స్‌తో నరకం! లీవ్ కోసం ప్రూఫ్ కావాలని మేనేజర్ ఉద్యోగిని అడగడంతో..

ABN, Publish Date - Oct 21 , 2024 | 05:44 PM

పైల్స్‌తో ఇబ్బంది పడుతూ లీవ్ అడిగిన ఓ ఉద్యోగిని మేనేజర్ ప్రూఫ్ పంపించమని అడిగారు. దీంతో, సదరు ఉద్యోగి మలద్వారానికి సంబంధించిన ఫొటోలు పంపించి చివరకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నెట్టింట ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: పైల్స్‌లో ఇబ్బంది పడే ఎందరో వ్యక్తులు తమ సమస్యను ఇతరులతో చెప్పుకోలేక నరకం అనుభవిస్తుంటారు. ఎప్పుడు మొదలవుతుందో తెలీని ఈ సమస్యతో ఒక్కోసారి కుదురుగా కూర్చుని పనిచేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా పైల్స్ సమస్య మళ్లీ తిరగబెట్టడంతో ఓ ఉద్యోగి మేనేజర్‌ను లీవ్ అడిగాడు. ప్రూఫ్ ఉంటేనే లీవ్ ఇస్తానంటూ మేనేజర్ తేల్చి చెప్పడంతో ఆ ఉద్యోగి కోపం నషాళానికి అంటింది. దీంతో, అతడు ఎవరూ ఊహించలేని పని చేశారు. చివరకు తను చేసింది తప్పో రైటో తెలీక నెట్టింట గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (viral). పూర్తి వివరాల్లోకి వెళితే,

Viral News: పెళ్లి చేసుకునేందుకు 2 రోజులు సెలవు అడిగితే తిరస్కరించిన సీఈవో.. కారణం ఏంటో తెలుసా?


తన కెదురైన వింత పరిస్థితిని వివరిస్తూ సదరు ఉద్యోగి రెడిట్‌లో తన ఆవేదన పంచుకున్నాడు. పైల్స్ సమస్య అకస్మాత్తుగా తీవ్రం కావడంతో తాను ఆ రోజు సెలవు కోరుతూ మెసేజ్ పెట్టినట్టు అతడు చెప్పుకొచ్చాడు. కనీసం నిలబడలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలిపాడు అయితే, మేనేజర్ నుంచి మాత్రం ఊహించని సమాధానం వచ్చిందని, తన పైల్స్‌కు సంబంధించి ఆధారాలు చూపించమని అడిగాడని ఉద్యోగి అన్నాడు. దీంతో, ఆవేశంలో తాను పైల్స్ ఉన్న భాగాన్ని ఫొటో తీసి మేనేజర్‌కు పంపినట్టు వెల్లడించాడు.

Viral: కన్నబిడ్డ ప్రాణాలతో చెలగాటం! వ్యూస్ కోసం ఇంత కక్కుర్తా..

‘‘వెనక్కు తిరిగి చూసుకుంటే అలా చేసి ఉండాల్సింది కాదని ఇప్పుడు అనిపిస్తోంది. ఎన్ని చట్టాలను ఉల్లంఘించానో ఏంటో? హెచ్ ఆర్ వాళ్లతో సమస్య వస్తుందా? మేనేజర్ ఈ ఫోటో గురించి పోలీసులకు చెబితే ఏమవుతుందో’’ అంటూ తన మనసులో మాటను చెప్పాడు. సహజంగానే ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ అనేక మంది వాపోయారు.


Viral: 300 మంది ఉద్యోగుల్ని కోటీశ్వరుల్ని చేసి.. విచారంలో కంపెనీ యజమాని! ఎందుకంటే..

కాగా, ఉద్యోగుల సెలవులకు సంబంధించి కొంత కాలం క్రితం మరోఉదంతం కూడా చర్చనీయాంశంగా మారింది. జ్వరంతో బాధపడుతూ సెలవు కోరితే వారం ముందుగా చెబితేనే సెలవు ఇస్తానని మేనేజర్ అన్నట్టు ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. జ్వరం ఎప్పుడు వస్తుందో ఎవరైనా చెప్పగలమా అంటూ సదరు ఉద్యోగి నెట్టింట వాపోయాడు. మేనేజర్ పంపించిన మెసేజీల ఫొటోలను కూడా షేర్ చేశారు. అప్పట్లో ఈ ఉదంతం చాలా రోజుల పాటు ట్రెండ్ అయ్యింది.

Read Latest and Viral News

Updated Date - Oct 21 , 2024 | 05:48 PM