ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Heart Attack: గుండె నొప్పి వచ్చిన 4 గంటల్లోపు ఇది తీసుకుంటే మరణాలు తగ్గించవచ్చు

ABN, Publish Date - May 20 , 2024 | 09:14 PM

రోజురోజుకూ పెరుగుతున్న గుండెపోటు(heart attacks) కేసులు అనేక మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత చెందిన సందర్భాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో గుండెపోటు గురించి హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం(Harvard T.H. Chan School study) సర్వేలో కీలక అంశాలను వెల్లడించింది.

heart attack may reduce Harvard T.H. Chan School study

రోజురోజుకూ పెరుగుతున్న గుండెపోటు(heart attacks) కేసులు అనేక మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఈ వ్యాధి బారిన పడి మృత్యువాత చెందిన సందర్భాలు ఇటివల వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో గుండెపోటు గురించి హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం(Harvard T.H. Chan School study) సర్వేలో కీలక అంశాలను వెల్లడించింది. ఈ వ్యాధి బారిన పడిన వారు గుండెనొప్పి వచ్చిన 4 గంటల్లోపు ఆస్పిరిన్ తీసుకుంటే గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని పరిశోధనలో వెల్లడైందని తెలిపారు.


గుండెపోటు మరణాలను తగ్గించడంలో ఆస్పిరిన్(Aspirin) పనిచేస్తుందని స్పష్టం చేశారు. మే 1న అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఛాతీ నొప్పిని ఎదుర్కొన్న కొన్ని గంటల్లోనే బాధితులు ఆస్పిరిన్ తీసుకుంటే ప్రతి ఏటా 13,000 కంటే ఎక్కువ గుండెపోటు మరణాలు ఆలస్యం కావచ్చని పేర్కొన్నారు. ఈ క్రమంలో గుండెపోటుతో మరణాన్ని నివారించడానికి ఆస్పిరిన్ చౌకైన ప్రభావవంతమైన మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో గుండెపోటు (heart attacks) లక్షణాలు కనిపించిన 4 గంటలలోపు ఆస్పిరిన్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఛాతీ నొప్పి ఉన్నప్పటికీ, చాలా మందికి దాని గురించి తెలియదు. ఆస్పిరిన్ తీసుకున్న తర్వాత ఇతర నివారణ పద్ధతులను పాటించాలని పరిశోధకులు తెలిపారు. మీరు ఎప్పుడైనా ఛాతీ నొప్పి గుండెపోటు అని భావిస్తే నాలుక కింద 325 mg ఆస్పిరిన్ ఉంచండి లేదా నమలండి. ఇలా చేయడం వల్ల తక్షణ ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. దీన్ని నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు.

గమనిక: మీకు ఆస్పిరిన్‌కు అలెర్జీ ఉంటే, వైద్యుడిని సంప్రదించండి. అనవసరంగా రోజూ ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది.


ఇది కూడా చదవండి:

Bike Safety Tips: ఈ తప్పులు చేయకండి.. యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోండి


EMI Bounced: మీ లోన్ ఈఎంఐలు బౌన్స్ అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి

Read Viral and Telugu News

Updated Date - May 20 , 2024 | 09:21 PM

Advertising
Advertising