ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic Day: ఆగస్టు 15, జనవరి 26.. జెండా ఆవిష్కరణలో ఈ తేడాలు మీకు తెలుసా..

ABN, Publish Date - Jan 25 , 2024 | 04:59 PM

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం అని, జనవరి 26న గణతంత్ర దినోత్సవం అని మనందరికీ తెలిసిందే. రెండు పండుగలప్పుడూ మనం చేసే పని.. జెండా ఎగరేయడం.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం అని, జనవరి 26న గణతంత్ర దినోత్సవం అని మనందరికీ తెలిసిందే. రెండు పండుగలప్పుడూ మనం చేసే పని.. జెండా ఎగరేయడం. పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల కూడళ్లల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి, జెండా వందనం చేస్తారు. బ్రిటీష్ పరిపాలన నుంచి విముక్తి, స్వేచ్ఛను పొందిన రోజు కాబట్టి ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటాం. అలాగే.. మనం ఎవరు? మన గుర్తింపు ఏమిటి? మనం చేయాల్సిన విధులు ఏంటి.. మనకు రక్షణ ఏది అనే విధివిధానాలను రాజ్యాంగం చెబుతుంది. హక్కులు, బాధ్యతలు అన్నీ చెప్పేది రాజ్యాంగమే. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26ను మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఆగస్టు 15కి, జనవరి 26కి జెండా ఎగరేసే విషయంలో కొన్ని తేడాలున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాను కింది భాగంలో కట్టి పైకి లాగుతారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం పొందిన చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా అలా చేస్తారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆల్రెడీ పైనే ఉంటుంది. పైకి లాగేలా ఉండదు. అంటే భారత్ ఆల్రెడీ స్వతంత్రంగా ఉందని అర్థం. స్వాతంత్ర్య దినోత్సవం రోజు భారత ప్రభుత్వ అధిపతిగా మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేస్తే గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి ఎగురవేస్తారు.

Updated Date - Jan 25 , 2024 | 05:04 PM

Advertising
Advertising