ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: చిరుతపై ప్రతీకారం! తమ ఫ్రెండ్‌ను చంపేసిందని.. వైరల్ వీడియో!

ABN, Publish Date - Jun 07 , 2024 | 09:27 PM

గుంపులుగా జీవించే జంతువులు ప్రమాదాలు ఎదురైనప్పుడు కలిసికట్టుగా ఎదుర్కొంటాయి. అవసరమైతే ప్రతీకార దాడులకు కూడా దిగుతాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: గుంపులుగా జీవించే జంతువులు ప్రమాదాలు ఎదురైనప్పుడు కలిసికట్టుగా ఎదుర్కొంటాయి. అవసరమైతే ప్రతీకార దాడులకు కూడా దిగుతాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. తమ ఫ్రెండ్‌ను చంపిన చిరుతపై బబూన్ కోతులు ఆశ్చర్యం గొలిపే రీతిలో ప్రతీ దాడికి దిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Viral: జిమ్‌లో చోరీ చేస్తూ పట్టుబడ్డ దొంగ! ఓనర్ ఎలాంటి శిక్ష వేశాడో తెలిస్తే..

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ చిరుత అకస్మాత్తుగా బబూన్ల గుంపుపై దాడి చేసింది. ఓ బబూన్ కోతిని చంపి నోట కరిచి తీసుకెళ్లసాగింది. కళ్లముందే తమ ఫ్రెండ్‌ను కోల్పోవడం జీర్ణించుకోలేకపోయిన బబూన్ కోతులు ప్రతీకార దాడికి దిగాయి. చిరుతను వెంబడించి ఉక్కిరిబిక్కిరి చేశాయి. చిరుత వాటిపై దాడి చేసేందుకు సిద్దమైనా భయపడక ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాయి. ఇన్ని బబూన్ కోతులు ఒక్కసారిగా దాడికి రెడీ అవడంతో చిరుత బెదిరిపోయింది. మరో మార్గం లేక తను చంపిన కోతి కళేబరాన్ని అక్కడే వదిలేసి బతుకు జీవుడా అనుకుంటూ పారిపోయింది.


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు సహజంగానే బబూన్ల ధైర్యానికి షాకైపోతున్నారు. తమ ఫ్రెండ్ ను కాపాడుకోలేకపోయినా కూడా చిరుతను తరిమికొట్టిన తీరు చూసి సర్‌ఫ్రైజ్ అవుతున్నారు. అయితే, కొందరు మాత్రం చిరుత మళ్లీ తిరిగొస్తుందని చెప్పారు. బబూన్లు కోపం మీద ఉన్నాయి కనుక వాటికి చిక్కకుండా అది పారిపోయిందని తెలిపారు. తమ ఫ్రెండ్ చనిపోయిందని గ్రహించాక అవి అక్కడి నుంచి వెళ్లిపోతాయని, అప్పుడు చిరుత మెల్లగా వచ్చి తన పని చేసుకుంటుందని చెబుతున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో ట్రెండింగ్ లో ఉంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 09:30 PM

Advertising
Advertising