ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bald Head: పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేకపోతే బట్టతల రావడం ఖాయం..!

ABN, Publish Date - Jun 29 , 2024 | 03:40 PM

రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు జుట్టుకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంటాయి. జుట్టు విషయంలో చాలా మంది చేసే 5 తప్పులు బట్టతల రావడానికి కారణం అవుతాయట.

రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు జుట్టుకు చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లడం, ఇతర ప్రాంతాలలో నీటిని ఉపయోగించడం, ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వంటివి జుట్టును దెబ్బతీస్తాయి. జుట్టు రాలిపోవడానికి, జుట్టు బలహీనంగా మారడానికి కారణం అవుతాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా జుట్టు విషయంలో చాలా మంది చేసే 5 తప్పులు బట్టతల రావడానికి కారణం అవుతాయట. అవేంటో తెలుసుకుంటే బట్టతల రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు.

వెంట్రుకలను గట్టిగా కట్టడం..

జుట్టును చాలా గట్టిగా కట్టడం, లేదా జడను గట్టిగా అల్లడం వంటివి చేయడం వల్ల జుట్టు నెత్తిమీద నుండి లాగినట్టు అవుతుంది. దీని కారణంగా జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. జుట్టు వదులుగా మారడం, విరిగిపోవడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే జుట్టు రాలే సమస్య ఎక్కువై బట్టతల వస్తుంది. కాబట్టి జుట్టును ఎప్పుడూ కాస్త వదులుగా ఉంచుకోవాలి.

Bill Gates: బిల్ గేట్స్ సక్సెస్ కావడానికి ఈ అలవాట్లే కారణం..!



హెయిర్ స్టైలింగ్..

జుట్టు స్టైల్ చేసుకునే విధానం బట్టతలకు కారణం అవుతుందా అంటే అవుననే అంటున్నారు హెయిర్ కేర్ నిపుణులు. హెయిర్ స్టైల్ చేసుకోవడంలో భాగంగా హెయిర్ స్ట్రైయిటనర్ లు, హెయిర్ డ్రైయర్లు వాడటం వల్ల జుట్టు పొడిబారి రఫ్ గా మారుతుంది. ఇది కాస్తా జుట్టు పెళుసుగా మారి విరిగిపోవడానికి కారణం అవుతుంది. వీటిని ఎక్కువ వాడుతుంటే కొద్దికాలానికే జుట్టు బాగా రాలిపోయి బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. హెయిర్ డ్రైయర్లు, హెయిర్ స్ట్రైయిటనర్లు వాడేటప్పుడు ప్రొటెక్షన్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

ఆలివ్ ఆయిల్..

జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుందనే కారణంతో చాలామంది ఆలివ్ ఆయిల్ ను జుట్టుకు పెడుతుంటారు. అయితే తలకు ఆలివ్ ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు సెబోర్హెయిక్ డెర్మటైటిస్ అనే సమస్య వస్తుంది.

Black Chickpeas: నల్ల శనగలు ఇలా తిని చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!



క్రాష్ డైటింగ్..

బరువు తగ్గడం కోసం కొందరు క్రాష్ డైటింగ్ పదే పదే చేస్తుంటారు. ఈ డైటింగ్ లో పోషకాల కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా జుట్టు దారుణంగా రాలిపోయి బట్టతల వస్తుంది.

వేడి నీరు..

తలస్నానం చేయడానికి చాలా మంది వేడి నీరు ఉపయోగిస్తారు. గోరు వెచ్చగా ఉన్న నీటికి బదులు వేడి నీరు ఉపయోగించడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. దీని కారణంగా జుట్టు రాలడం, పెరుగుతుంది. అంతేకాదు జుట్టు పొడిబారి రఫ్ గా మారుతుంది.

Indigestion: అజీర్తి వేధిస్తోందా? ఈ టిప్స్ తో తొందరగా తగ్గించేయచ్చు..!


Immunity Herbs: ఈ 8 మూలికలు వాడండి చాలు.. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి బలపడుతుంది..!


మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 29 , 2024 | 03:40 PM

Advertising
Advertising