ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వీటిల్ని షూస్ అంటారా? ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో!

ABN, Publish Date - Dec 09 , 2024 | 09:36 PM

పాదాలకు ఏమాత్రం రక్షణ ఇవ్వని ఓ చెప్పుల జత ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

ఇంటర్నెట్ డెస్క్: జనాలు బూట్లు ధరించేది పాదాల్ని కాపాడుకునేందుకే! షూస్ లక్ష్యం అదొక్కటే. కానీ మనిషన్నాక కూసంత కళాపోషణ ఉండాలి. కాబట్టి, పలు కంపెనీలు తమ ఉత్పత్తుల్లో ఫ్యాషన్ చొప్పిస్తుంటాయి. చూడటానికి, వాడటానికి అనూకూలంగా తమ ఉత్పత్తులను డిజైన్ చేస్తుంటాయి. ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌లన్నీ తమ ఉత్పత్తుల్లో కొత్త ఫ్యాషన్‌లను చొప్పించకుండా మార్కెట్లో విడుదల చేయవు. అయితే, ఇలా డిజైన్ కొత్త పుంతలు తొక్కించాలనే చాదస్తంలో పడి అసలు లక్ష్యాన్ని మరిచిపోకూడదు. కానీ ఓ కంపెనీ సరిగ్గా ఇదే చేసి ప్రస్తుతం నెట్టింట విమర్శల పాలవుతోంది. సదరు కంపెనీ చేసిన బూట్ల జత చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు (Viral).

Viral: దేవుడా! ఈ ఒక్క ప్రశ్నకు యస్ చెప్పినందుకు 100 మంది ఉద్యోగులకు ఊస్టింగ్!


స్పెయిన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ బెలన్సియాగా ఓ కొత్త రకం షూస్‌ను తాజాగా మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ షూస్ పేరు జీరో. దీన్ని మినిమలిస్టిక్ విధానంలో రూపొందించింది. ఎవ్వరూ ఊహించని ఆకృతిలో వీటిని రూపొందించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అసలు ఇవి పాదాలను కవర్ చేస్తున్నట్టే ఉండవు. సాదారణంగా బూట్లు అంటే పాదాలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. పాదం పైభాగాన్ని కూడా పూర్తిగా మూసి ఉంచుతాయి. ఎవరైనా ఇలాంటి వాటినే ధరించాలనుకుంటారు. పాదాలకు పూర్తి రక్షణ కోరుకుంటారు. కానీ బెలన్సియాగా డిజైన్‌లో మాత్రం ఇవన్నీ చాలా పరిమితంగా ఉంటాయి. ఈ బూట్లు దరించిన వారి కాళ్లు, వేళ్ల పైభాగానికి ఎలాంటి రక్షణ ఉండదు. పాదాల అడుగు భాగం, మడమల అడుగు భాగాన్ని మాత్రమే రక్షించేలా వీటిని డిజైన్ చేశారు. కాలి మధ్య భాగం మాత్రం నేలను తాకుతున్నట్టు ఉంటుంది.

Viral: బ్యాంకు మేనేజర్ దగా! లోన్ ఆశ పెట్టి రూ.39 వేల నాటు కోళ్లు స్వాహా!


ఈ డిజైన్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఫ్యాషన్ కోసం బూట్ల అసలు లక్ష్యాన్నే మరిచినట్టున్నారుగా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ షూస్ వేసుకుంటే పాదాలకి రక్షణ ఉండదని కొందరు చెప్పుకొచ్చారు. చూడటానికి క్యూట్‌గా ఉన్నాయంటూ కొందరు మాత్రం వాటి డిజైన్‌ను మెచ్చుకున్నారు. ఫ్యాషన్ పేరిట అధిక ధరలు వసూలు చేయాలన్నదే అసలు వ్యూహం అయి ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నట్టు.. వచ్చే ఏడాది ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందట. ధర మాత్రం భారీగానే ఉంటుందని కొందరు అంటున్నారు.

Read Latest and Viral News

Updated Date - Dec 09 , 2024 | 09:41 PM