Viral: చక్కగా నిద్రపోయింది.. ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.. అసలు పోటీ ఏంటంటే..
ABN , Publish Date - Oct 02 , 2024 | 11:37 AM
``ద గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ – 2024`` సర్వే ప్రకారం దాదాపు 50 శాతం మంది భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో బెంగళూరుకు చెందిన ఓ ఫిన్‌టెక్ కంపెనీ నిద్ర పోటీలు పెట్టింది. ఆ పోటీలో ఓ మహిళా ఉద్యోగిణి పాల్గొని ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.
ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడి, అసహజమైన పని వేళల కారణంగా చాలా మంది అనవసర ఒత్తిడి (Pressure)ని ఎదుర్కొంటున్నారు. కంటికి సరిపడా నిద్ర, కడుపు నిండా తిండికి దూరమవుతున్నారు. ఇటీవల ``ద గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్ – 2024`` సర్వే ప్రకారం దాదాపు 50 శాతం మంది భారతీయులు నిద్రలేమి (Sleeplessness)తో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో బెంగళూరు (Bengaluru)కు చెందిన ఓ ఫిన్‌టెక్ కంపెనీ ఫన్నీ పోటీలు పెట్టింది. ఆ పోటీలో ఓ మహిళా ఉద్యోగిణి పాల్గొని ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది (Viral News).
``వేక్‌ఫిట్`` సంస్థ ప్రతి ఏటా ``స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్`` పేరుతో నిద్ర పోటీలు నిర్వహిస్తుంటుంది. తాజాగా జరిగిన పోటీల్లో 11 మంది పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొనే వారు రోజూ 8 నుంచి 9 గంటల పాటు సంపూర్ణ నిద్రను అనుభవించాలి. పగటి పూట కూడా 20 నిమిషాల పాటు గాఢంగా నిద్రపోవాలి. ప్రత్యేక పరికరాలతో పోటీదారుల నిద్రను ట్రాక్ చేస్తారు. వారిలో ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోయిన వారిని విజేతగా ప్రకటిస్తారు. పోటీలో పాల్గొనే వారికి నాణ్యమైన పరుపు, కాంటాక్ట్ లెస్ స్లీప్ ట్రాకర్ ఇస్తారు. ఈ పోటీలో గెలిచిన వారికి స్లీప్ చాంపియన్’ టైటిల్‌తోపాటు రూ.9 లక్షల భారీ మొత్తాన్ని బహుమతిగా అందజేస్తారు.
తాజా పోటీలో బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సాయీశ్వరి పాటిల్ విజేతగా నిలిచారు. విజేతగా నిలిచిన సాయిశ్వరి తన అనుభవాన్ని పంచుకున్నారు. కోవిడ్ తర్వాత తన దినచర్య పూర్తిగా మారిపోయిందని, ఆడిటర్‌గా తాను ఎదుర్కొనే పని ఒత్తిడి కారణంగా నిద్రలేమితో బాధపడినట్టు తెలిపారు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో ఈ పోటీ తనకు నేర్పిందని సాయీశ్వరి పేర్కొన్నారు. ప్రశాంతమైన జీవన విధానమే కమ్మటి నిద్రకు మూల సూత్రమని అన్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వేగంగా వెళ్తున్న బైక్‌పై విన్యాసాలు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..