ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: చూసేందుకు పాడుబడిన మరుగుదొడ్లే.. కానీ వాటి వెనుకకు వెళ్లి చూడగా.. దిమ్మతిరిగే దృశ్యం..

ABN, Publish Date - Jan 24 , 2024 | 04:45 PM

ఎన్నో అద్భుతాలు, అందాలతో నిండిన ఈ ప్రకృతిలో ఇప్పటికీ మనిషికి తెలీని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు మనిషికి ఆహ్దాదంతో పాటూ మనశ్శాంతిని కూడా అందిస్తుంటాయి. నిత్యం అలాంటి ప్రదేశాల్లో గడపాలని అనిపిస్తుంటుంది. ఇలాంటి..

ఎన్నో అద్భుతాలు, అందాలతో నిండిన ఈ ప్రకృతిలో ఇప్పటికీ మనిషికి తెలీయని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు మనిషికి ఆహ్దాదంతో పాటూ మనశ్శాంతిని కూడా అందిస్తుంటాయి. నిత్యం అలాంటి ప్రదేశాల్లో గడపాలని అనిపిస్తుంటుంది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పాడుబడ్డ పాఠశాల మరుగుదొడ్ల వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చూసేందుకు మరుగుదొడ్లే అయినా.. వాటి వెనుక ఉన్న దృశ్యం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇండోనేషియా (Indonesia) తూర్పు నుసాటెంగ్‌గారాలోని పాఠశాలకు చెందిన పాడుబడ్డ మరుగుదొడ్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూసేందుకు ఇవి పాడుబడ్డ మరుగుదొడ్ల తరహాలో కనిపిస్తుంటాయి. అయితే మరుగుదొడ్ల మధ్యలో ఉన్న దారి నుంచి అవతలి వైపు వెళ్లి చూడగా.. అందమైన సముద్ర తీరం (Beautiful beach) చూపరులను కట్టిపడేస్తోంది. పచ్చని పృకృతి మధ్య నీలి రంగులో ఉన్న సముద్ర తీరంతో పాటూ చల్లటి గాలులు పర్యాటలకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Viral Video: పగిలిపోయిన లారీ లైటుకు అదిరిపోయే రీప్లేస్‌మెంట్.. ఎలా వస్తాయయ్యా! ఇలాంటి ఐడియాలు..

ఈ పాఠశాల మరుగుదొడ్లను కొండ అంచున నిర్మించారు. దూరం నుంచి చూస్తే అక్కడ ఏమీ లేదని అనిపిస్తుంది. కానీ ఆ మరుగుదొడ్ల వెనుకకు వెళ్లగానే అందమైన సముద్ర తీరం అందరినీ ఉల్లాసపరుస్తుంది. ఇక్కడికి పర్యాటకులు నిత్యం అధిక సంఖ్యలో తరలివెళ్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆహా! ఎంత అందమైన ప్రదేశం’’.. అంటూ కొందరు, ‘‘జీవితంలో ఓసారైనా ఇలాంటి ప్రదేశానికి వెళ్లి రావాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tasty Food: మరుసటి రోజు తింటే.. అదిరిపోయే రుచిని అందించే.. ఆ 5 వంటకాలు ఏంటంటే..

Updated Date - Jan 24 , 2024 | 04:45 PM

Advertising
Advertising

సంబంధిత వార్తలు

మరిన్ని చదవండి