ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఇలాంటి వ్యక్తికి రూ.65 లక్షల శాలరీనా! గూగుల్ ఆఫర్‌కు జనాలు షాక్

ABN, Publish Date - Oct 05 , 2024 | 08:00 AM

సాఫ్ట్‌వేర్ రంగంలో అసాధారణ శాలరీలు ఉంటాయన్న విషయం తెలిసిందే కానీ కొన్ని ఆఫర్లు మాత్రం టెకీలు కూడా నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి. అలాంటి ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పదేళ్ల అనుభవం ఉన్న ఓ వ్యక్తికి గూగుల్ ఇచ్చిన ఆఫర్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సాఫ్ట్‌వేర్ రంగంలో అసాధారణ శాలరీలు ఉంటాయన్న విషయం తెలిసిందే కానీ కొన్ని ఆఫర్లు మాత్రం టెకీలు కూడా నోరెళ్లబెట్టేలా చేస్తుంటాయి. అలాంటి ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. పదేళ్ల అనుభవం ఉన్న ఓ వ్యక్తికి గూగుల్ ఇచ్చిన ఆఫర్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..


జేపీ మార్గన్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తికి గూగుల్ రూ.65 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. దీన్ని మరో నెటిజన్ నెట్టింట పంచుకోవడంతో ఈ ఉదంతం ఒక్కసారిగా వైరల్‌ అయిపోయింది. సదరు జేపీ మోర్గన్ ఉద్యోగికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా 10 ఏళ్ల అనుభవం ఉందని, కానీ అతడు ఓ చిన్న కాలేజీలో ఇంజినీరింగ్ చేశాడని తెలిపాడు. అతడికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఏటా రూ.65 లక్షల శాలరీతో పాటు రూ.9 లక్షల బోనస్, మరో రూ.19 లక్షలు సైనింగ్ బోనస్ కింద ఇచ్చేందుకు గూగుల్ ఒప్పుకొందని చెప్పుకొచ్చాడు. ఇక రీలొకేషన్ బోనస్ కింద మరో రూ.5 లక్షలు కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యిందని తెలిపాడు. ‘‘పదేళ్ల అనుభవంతో ఇలాంటి క్రేజీ ఆఫర్సే వస్తాయి’’ అన్న క్యాప్షన్‌తో ఈ ఉదంతాన్ని షేర్ చేశాడు.

Viral: ‘నాన్నా! నాకు యాక్సిడెంట్ అయ్యింది’ అంటూ ఫోన్! తండ్రికి డౌట్ రావడంతో..


కొన్ని రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆ ఆఫర్ చూసి అనేక మంది షాకైపోయారు. తమకూ ఇలాంటి అనుభవం ఉన్నా ఈ ప్యాకేజీని ఎవరూ ఆఫర్ చేయలేదని కామెంట్ చేశారు. ‘‘ఇదేమైనా పెద్ద విషయమా, టెక్ రంగంలో ఈ మాత్రం శాలరీలు సాధారణమే కదా?’’ అని కొందరు సందేహం వెలిబుచ్చారు.

Viral: 130 ఏళ్ల నాటి కెమెరాతో ఫొటో తీశాడు.. ఎలా ఉందో మీరే చూడండి!

కొందరు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదని తేల్చేశారు. ఆరేళ్ల అనుభవం ఉన్న వాళ్లు కూడా ఈ మాత్రం శాలరీలు తీసుకుంటున్నారని, అంతకంటే ఎక్కువ తీసుకున్న వారూ తనకు తెలుసునని ఓ వ్యక్తి చెప్పాడు. ‘‘ఐఐటీ డిగ్రీ ఉన్న వాళ్లకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే అంతకంటే ఎక్కువ ప్యాకేజీలు వస్తాయి. ఇదేమీ వింత కాదు. నాన్ ఐఐటీ ఇంజినీర్ అయినంత మాత్రాన సంస్థకు విలువ జోడించలేడని కాదుగా? కానీ లోకల్ కాలేజీలో చదివి, అదీ సీఎస్ బ్యాక్‌‌గ్రౌండ్ లేకుండా ఆ శాలరీ తీసుకోవడమంటే నిజంగా గ్రేటే’’ అని మరో వ్యక్తి అభిప్రాపడ్డాడు.

‘‘ఇదేమీ అంత గొప్ప శాలరీ కాదు. అదే కంపెనీ మిగతా వాళ్లకు అంతకంటే ఎక్కువ ఇచ్చిన ఉదంతాలు నాకు తెలుసు. కానీ.10 ఏళ్ల అనుభవం.. ఎల్ 5 అంటే.. చాలా నైపుణ్యం ఉన్నట్టు’’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ టాపిక్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Latest and Viral News

Updated Date - Oct 05 , 2024 | 08:39 AM