ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: చికెన్ షావర్మా తినబోయి ఖంగుతిన్న వ్యక్తి.. స్విగ్గీకి ఫిర్యాదు చేయగా.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందంటే..

ABN, Publish Date - Jan 13 , 2024 | 12:16 PM

ఆకలి వేసిందంటే చాలు.. ఇలా ఫోన్ తీసుకుని, అలా ఆర్డర్ పెట్టేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఎలాంటి కష్టం లేకుండా వేడి వేడి ఆహారం ఇంటికే వస్తుండడంతో అంతా ఇదే పద్ధతికి అలవాటు పడ్డారు. అయితే...

ఆకలి వేసిందంటే చాలు.. ఇలా ఫోన్ తీసుకుని, అలా ఆర్డర్ పెట్టేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ఎలాంటి కష్టం లేకుండా వేడి వేడి ఆహారం ఇంటికే వస్తుండడంతో అంతా ఇదే పద్ధతికి అలవాటు పడ్డారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఫుడ్ ఆర్డర్ చేయగా చివరకు అందులో చిత్రవిచిత్రమైన వస్తువులు, జీవులు బయటపడడం చూశాం. తాజాగా, ఓ వ్యక్తికి ఇలాంటి విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి స్వీగ్గిలో చికెన్ షావర్మా ఆర్డర్ పెట్టాడు. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని (Bangalore) నాగవరా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు సమీపంలోని హోటల్ నుంచి చికెన్ షావర్మాను (Chicken shawarma) ఆర్డర్ చేశాడు. ఆర్డర్ అయితే నిముషాల వ్యవధిలో వచ్చింది గానీ.. దాన్ని తినే క్రమంలోనూ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చికెన్ షావర్మాను సగం తినగానే నోట్లో ఏదో గట్టిగా తగలడంతో కంగారుపడ్డాడు. చివరకు అందులో ఇనుప ముక్క ఉండడం చూసి ఖంగుతిన్నాడు. దీంతో వాటిని ఫొటోలు తీసి, (Complaint to Swiggy Company) స్విగ్గీకి కంపెనీకి ఫిర్యాదు చేశాడు.

Viral Video: ఎవర్రా దీనికి ట్రైనింగ్ ఇచ్చిందీ... ఒలంపిక్స్‌కి పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం..

అయితే ఈ ఘటనపై కాసేపటికి స్విగ్గీ కస్టమర్ కేర్ టీం స్పందించింది. ఈ ఘటనపై వారు ఎలాంటి క్షమాపణలు గానీ.. డబ్బులు పూర్తి రీఫండ్ చేయకుండా కేవలం రూ.50పంపించి చేతులు దులుపుకొన్నారు. దీంతో సదరు యువకుడు మళ్లీ షాక్ అయ్యాడు. రూ.160లు పైగా ఖర్చు చేసి చికెన్ షావర్మా ఆర్డర్ చేస్తే.. రూ.50 ఇచ్చి సరిపెడతారా అంటూ మండిపడ్డాడు. ఇనుప ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ.. అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. కనీసం తనకు క్షమాపణలు కూడా చెప్పకపోవడంతో కోపంగా ఉందని తెలిపాడు. ఇలా నిర్లక్ష్యం వహించే హోటళ్లను స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లో లేకుండా నిషేధించాలని కోరాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: పార్టీలో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాడు.. చివరకు చూస్తే ఇలా బుక్కయ్యాడు..

Updated Date - Jan 13 , 2024 | 12:16 PM

Advertising
Advertising