ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వీధుల్లో దుస్తులు అమ్ముకుంటున్న బాలికకు ఊహించని సర్‌ప్రైజ్! అపరిచితుడు ఇచ్చిన బాక్స్ విప్పి చూస్తే..

ABN, Publish Date - Apr 30 , 2024 | 04:25 PM

బెంగళూరులో ఓ చోట ఫుట్‌పాత్‌పై దుస్తులు అమ్ముకుంటున్న బాలికకు ఓ యూట్యూబర్ ఫాస్ట్‌ట్రాక్ వాచీని బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Bengaluru Youtuber surprises youg street vendor with gift

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు వీధుల్లో దుస్తులు అమ్ముకుంటున్న బాలికకు ఓ యూట్యూబర్ సర్‌ప్రైజ్ ఇచ్చిన తీరు ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. బాలిక కళ్లల్లో ఆనందం అనేక మందిని కదిలించడంతో యూట్యూబర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రహదీశ్ బాలసుబ్రమణ్యన్ అనే యూట్యూబర్ ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ బాలిక వీధిలో దుస్తులను అమ్ముకుంటోంది. ఆమెను చూసిన ప్రహదీశ్ అక్కడకు వెళ్లాడు. తన దగ్గర ఓ మిస్టరీ బాక్స్ ఉందని, రూ.10 రూపాయ పెట్టి కొంటావా అని సరదాగా అడిగాడు. చిన్నారి అమాయకంగా తన పర్సును చేక్ చేసి చూసుకుని తన వద్ద అంత డబ్బు లేదని చెప్పింది. ఒక్క రూపాయి అయినా ఇచ్చి బాక్స్ తీసుకోమని ప్రహదీశ్ అనగా మళ్లీ ఆమె పర్సును చెక్ చేసి రూపాయి కూడా తన వద్ద లేదని నిస్సహాయత వ్యక్తం చేసింది (Bengaluru man surprises young street vendor with new watch).

Viral: మగ సింహం కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు.. ఆడ సింహం వచ్చి కాపాడకపోయి ఉంటే..


దీంతో, ప్రహదీశ్ ఆ మిస్టరీ బాక్స్‌ను ఆమె చేతుల్లో పెట్టి బాక్స్ విప్పతీసి ఏముందో చూడమన్నాడు. ఆమె అలాగే చేసింది. చివరకు బాక్సులో ఫాస్ట్‌ట్రాక్ వాచీ కనిపించడంతో ఆమె సంబరం అంబరాన్ని అంటింది. అది చూసి ప్రహదీశ్ కూడా సంతోషించాడు. ఆ వాచీ నీకోసమే తెచ్చానని ఆమెతో చెప్పడంతో బాలిక మొహంలో ఆశ్చర్యానందాలు వెల్లివిరిసాయి.

ప్రహదీశ్ ఈ వీడియోను నెట్టింట పంచుకోవడంతో భారీగా రెస్పాన్స్ వచ్చింది. అతడి వీడియోకు ఏకంగా 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చిన్నారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చి మానత్వం చాటుకున్న ప్రహదీశ్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read Viral and Telugu News

Updated Date - Apr 30 , 2024 | 04:31 PM

Advertising
Advertising