Viral: ఆర్టీసీ కండక్టర్ రూ.5 చిల్లర ఇవ్వలేదంటూ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు.. చివరకు..
ABN, Publish Date - Apr 16 , 2024 | 09:15 PM
ఆర్టీసీ బస్సు టిక్కెట్టు కొన్న ఓ ప్రయాణికుడు తనకు కండక్టర్ రూ.5 చిల్లర వెనక్కివ్వలేదంటూ నెట్టింట పెట్టిన పోస్టు్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టీసీ బస్సు టిక్కెట్టు కొన్న ఓ ప్రయాణికుడు తనకు కండక్టర్ రూ.5 చిల్లర వెనక్కివ్వలేదంటూ నెట్టింట పెట్టిన పోస్టు్ ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. రకరకాల అభిప్రాయాలు, సూచనలు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరులో మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎమ్‌టీసీ) బస్సు ఎక్కిన ఓ వ్యక్తి తన ఫిర్యాదును ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘‘కండక్టర్ వద్ద అసలు చిల్లరే లేకపోవడంతో ఈ రోజు నేను టిక్కెట్‌పై రూ.5 కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా?’’ అని అతడు ప్రశ్నించాడు. బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ను ట్యాగ్ చేశాడు. ‘‘ప్రతిసారీ ఇలాగే డబ్బులు నష్టపోవాలా? కండక్టర్ల వద్ద సరిపడినంత చిల్లర ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్ చెల్లింపులకు అవకాశం కల్పించాలి’’ అని మరో ట్వీట్ చేశాడు (Bengaluru mans post on BMTC bus conductor not returning Rs 5 triggers debate).
Viral: ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థి జాబ్ వద్దన్నాడని.. హెచ్ఆర్ ఊహించని విధంగా..
దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కస్టమర్లు కూడా తమవద్ద తగినంత చిల్లర ఉండేలా చర్యలు తీసుకోవాలని కొందరు సూచించారు. ఇలా చేస్తే కండక్టర్‌కు తోటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలని సూచించారు. తాము అలాగే చేశామని కూడా చెప్పారు. కండక్టర్‌ల వద్ద యూపీఐ వసతి ఉందేమో కనుక్కోవాలని ప్రశ్నించారు. ఈ సమస్యలకు యూపీఐ చక్కని పరిష్కారమని కొందరు అన్నారు. మరోవైపు ప్రయాణికుడి పోస్టుపై బీఎమ్‌టీసీ కూడా స్పందించింది. అతడి ఫిర్యాదును నమోదు చేసుకున్నట్టు చెబుతూ ఓ నెంబర్ కూడా కేటాయించింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 16 , 2024 | 09:20 PM