ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఊబెర్ డ్రైవర్ ఆదాయం చూసి పేటీఎం ఫౌండర్ ఆశ్చర్యం!

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:14 PM

బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ తన నెల సంపాదన ఏకంగా రూ.80 వేలు అని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో పేటీఎం సహ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మనూ ఆకర్షించింది.

ఇంటర్నెట్ డెస్క్: ఊబెర్, ఓలా, స్విగ్గీ లాంటి కొత్త తరం సంస్థలు పుట్టుకొచ్చాక నగర జీవితం మరింత సౌకర్యవంతంగా మారింది. అటు డ్రైవర్లకు కూడా ఇదో ముఖ్య ఆదాయ వనరుగా మారింది. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ తన నెల సంపాదన ఏకంగా రూ.80 వేలు అని చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ ఉదంతం పేటీఎం సహ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను కూడా ఆకర్షించింది (Viral).

కర్ణాటక పోర్టఫోలియో పేరిట ఉన్న ఎక్స్ అకౌంట్‌లో ప్రస్తుతం ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. వీడియోలోని బైక్ ట్యాక్సీ డ్రైవర్ మాట్లాడుతూ తన నెల సంపాదన రూ.80 వేల నుంచి 85 వేల మధ్య ఉంటుందని చెప్పుకొచ్చాడు. కేవలం ఊబెర్ ద్వారానే ఈ మొత్తం అందుతోందని చెప్పుకొచ్చాడు. అయితే, ఈ మొత్తం కోసం రోజుకు 13 గంటలు కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇదంతా రికార్డు చేస్తున్న ప్యాసెంజర్ ఆశ్చర్యపోయాడు. తనకూ ఇంత ఆదాయం లేదని పేర్కొన్నాడు.

Elon Musk: నేను అప్పుడే చెప్పా.. కానీ నాకు మతి లేదని అన్నారు: ఎలాన్ మస్క్


కాగా, ఈ వీడియో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను కూడా ఆకర్షించింది. ‘‘ఉద్యోగిత పెంచడంలో భారత్లోని కొత్త తరం టెక్ సంస్థలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించేలా మంచి ఆదాయాన్ని ఇచ్చే కోట్ల కొద్దీ ఉద్యోగాలను సృష్టించాయి. మన డిటిజల్ వ్యవస్థకు మూల స్తంభాలు ఈ ఉద్యోగులే’’ అని పేర్కొన్నారు.

విజయ్ శేఖర్ శర్మ కామెంట్‌పై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. ‘‘అనేక మందికి ఈ యాప్‌లు గౌరవప్రదమైన ఆదాయమార్గాన్ని చూపించాయి. ఉపాధి హామీ పథకం కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి’’ అని ఓ వ్యక్తి అన్నారు.

Viral: వామ్మో.. మనుషులను శుభ్రపరిచే వాషింగ్ మెషీన్!


‘‘ఈ యాప్‌ల తొలి రోజుల్లో కొందరు ఊబెర్ ఆలంబనా తమ అప్పుల్లోంచి బయటపడి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. 15 ఏళ్ల నాటి అప్పును ఓ డ్రైవర్ ఆరు నెలల్లో తీర్చేశాడు’’ అని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. గిగ్ ఎకానమీ కూడా ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని ఈ బైక్ డ్రైవర్ నిరూపించాడని కొందరు కామెంట్ చేశారు.

సదరు డ్రైవర్ ఎదుర్కొనే కష్టాలను కొందరు ప్రస్తావించారు. 13 గంటల పాటు ట్రాఫిక్‌లో బైక్ నడపడమంటే ఎంతో అవస్థ పడాల్సి వస్తుందని అన్నారు. రోజూ బైక్ నడిపే అనేక మంది వెన్ను నొప్పితో బాధపడుతుంటారు. అతడి కష్టాన్ని కచ్చితంగా గుర్తించాల్సిందే’’ అని మరో కామెంట్ చేశాడు.

Viral: బ్యాంకు మేనేజర్ దగా! లోన్ ఆశ పెట్టి రూ.39 వేల నాటు కోళ్లు స్వాహా!

Read Latest and Viral News

Updated Date - Dec 10 , 2024 | 05:25 PM