Uber: ఈ ఉబర్‌కు ఏమైంది? 10 నిమిషాల ఆటో జర్నీ.. రూ.కోటికిపైగా బిల్లు!
ABN, Publish Date - Apr 01 , 2024 | 08:17 PM
ఉబర్ ఆటో బుక్ చేసుకున్న మరో ప్రయాణికుడికి భారీ షాక్ తగిలింది. కేవలం 10 నిమిషాల పాటు ప్రయాణించినందుకు ఏకంగా రూ.కోటికిపైగా బిల్లు రావడంతో ఆయన దిమ్మెరపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉబర్ ఆటో (Uber Auto) బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి తాజాగా భారీ షాక్ తగిలింది. కేవలం 10 నిమిషాల పాటు ప్రయాణించినందుకు ఏకంగా రూ.కోటికిపైగా బిల్లు (Over Rs.1 Crore Bill) రావడంతో ఆయన ఆశ్చర్యపోయారు. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఈ ఉదంతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. నెట్టింట వైరల్ (Viral) అవుతున్న ఈ ఉదంతం గురించి తెలిసి దిమ్మెరపోతున్న నెటిజన్లు అసలు ఈ ఉబర్‌కు ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు.
Viral: ప్రతి ఆసుపత్రిలో ఇలాంటి నర్సు ఉంటేనా.. వైరల్ వీడియో!
హైదరాబాద్‌కు చెందిన వ్లాగర్ శ్రీరాజ్ నీలేశ్ ఇటీవల తన భార్యతో కలిసి బెంగళూరులోని (Bengaluru) టిన్ ఫ్యాక్టరీ నుంచి కొరమంగళ వెళ్లేందుకు ఉబర్ ఆటో బుక్ చేసుకున్నారు. ఈ జర్నీకి బిల్లు రూ.207 అని యాప్‌లో కనిపించింది. గమ్యస్థానానికి చేరుకున్నాక డబ్బు చెల్లించేందుకు ప్రయత్నించగా బిల్లు రూ 1,03,11,055 అయినట్టు కనిపించింది. ఇది చూసి శ్రీరాజ్ ఆశ్చర్యపోయారు. ‘‘ఇదేం టెక్నికల్ సమస్య. కస్టమర్ కేర్ కూడా సమస్యపై స్పందించలేదు. అందుకే దీనికి రుజువుగా నేనీ వీడియోను ఇన్‌స్టాలో పెడుతున్నాను’’ అని ఆయన వీడియోలో కామెంట్ చేశారు. ఇలాంటి సందర్భాల్లో కస్టమర్లకు ప్రత్యామ్నాయాలు లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ముందు వచ్చిన బిల్లు మేరకు ఆటోవాలాకు రూ.207 చెల్లించారు. కాగా, ఈ ఉదంతం మరోసారి వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Anand Mahindra: ప్రతి సోమవారం ఇలా చేసి చూడండి.. ఆనంద్ మహీంద్రా సలహా వైరల్
ఇటీవల నోయిడాకు (Noida) చెందిన దీపక్ తెనుగారియా ఆటో బుక్ చేసుకుంటే రూ.7.66 కోట్ల బిల్లు వచ్చిన ఉదంతం వైరల్ అయిన విషయం తెలిసిందే. అతడు రూ.62 బిల్లు అవుతుందనుకుంటే ఏకంగా కోట్లల్లో బిల్లు రావడం చూసి ఆశ్చర్యపోయారు. మరోవైపు ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో తక్షణం స్పందించిన సంస్థ కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఇంతలోనే మరో ఘటన వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది.
Viral: కూతురు లండన్ నుంచి విదేశీ ప్రియుణ్ణి ఇంటికి తీసుకొస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 01 , 2024 | 08:29 PM