ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వాటర్ ప్యూరిఫైయ్యర్ ఇన్‌స్టాల్ చేసేందుకొచ్చిన టెక్నీషియన్.. మహిళ ఒంటరిగా ఉందని..

ABN, Publish Date - May 11 , 2024 | 08:49 PM

వాటర్ ప్యూరిఫయ్యర్ ఇన్‌స్టాలేషన్ కోసం మహిళ ఇంటికొచ్చిన ఓ టెక్నీషియన్ ఆమె అసభ్యంగా ప్రవర్తించాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: వాటర్ ప్యూరిఫయ్యర్ ఇన్‌స్టాలేషన్ కోసం మహిళ ఇంటికొచ్చిన ఓ టెక్నీషియన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బెంగళూరులో (Bengaluru) ఈ ఘటన వెలుగు చూసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

బేగుర్ ప్రాంతంలో నివసించే ఓ 30 ఏళ్ల మహిళ ఇటీవల తన వాటర్ ప్యూరిఫయ్యర్‌ను మరోసారి ఇన్‌స్టాల్ చేసేందుకు కంపెనీకి రిక్వెస్ట్ పెట్టింది. అపాయింట్‌మెంట్ ఇచ్చిన రోజు కాకుండా టెక్నీషియన్ మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చాడు. ఆ సమయంలో మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. అతడు ఇన్‌స్టాలేషన్ పని చేస్తున్న సమయంలో మహిళ వంటింట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో టెక్నీషియన్ వంటింట్లోకి వెళ్లి మహిళను అసభ్యంగా తాకే ప్రయత్నం చేశాడు (Bengaluru Woman Groped By Water purifier Technician Her Friend In Neighbourhood Came To Rescue ).

Viral: వామ్మో.. పాక్‌లో భారతీయ మహిళ ఫుడ్ స్టాల్.. మరీ ఇంత పాప్యులరా!


దీంతో, అతడి నుంచి తప్పించుకున్న యువతి మరో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఫ్రెండ్‌కు ఫోన్ చేసింది. ఆమె ఫ్రెండ్ వచ్చేసరికి అతడు మహిళ ఉన్న గది తలుపులు కొడుతూ గొడవ చేయసాగాడు. ఈ క్రమంలో మహిళ, ఆమె ఫ్రెండ్ ఇద్దరూ చుట్టుపక్కల వారిని అలర్ట్ చేసి నిందితుడిని నిలదీయడంతో అతడు పారిపోయాడు.

ఆ తరువాత బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కంపెనీకి ఫోన్ చేసి నిందితుడి వివరాలు తీసుకున్నారు. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read Viral and Telugu News

Updated Date - May 11 , 2024 | 09:04 PM

Advertising
Advertising