Viral: ఎల్‌ఈడీ బల్బుకు హైసెక్యూరిటీ.. వీళ్ల అతి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ABN, Publish Date - Oct 13 , 2024 | 03:28 PM

సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని వస్తువులు చోరీ కాకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంతలా అంటే కనీసం అతడి ఎల్‌ఈడీ బల్బును కూడా ఎవరూ ఎత్తుకెళ్లలేని విధంగా ఏర్పాట్లు చేశాడు. అతడు తీసుకున్న ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral: ఎల్‌ఈడీ బల్బుకు హైసెక్యూరిటీ.. వీళ్ల అతి తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

చాలా మంది తమ వస్తువులు చోరీ కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చూస్తుంటాం. ఈ క్రమంలో కొందరు తీసుకునే జాగ్రత్తలు చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటూ అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. కారు చోరీ కాకుండా దానిపై ముళ్ల కంచె వేయడం, కూలర్ చోరీ కాకుండా దాన్ని ఏకంగా గోడ మధ్యలో ఏర్పాటు చేయడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఎల్‌ఈడీ బల్బు చోరీ కాకుండా తీసుకున్న జాగ్రత్తలు చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని వస్తువులు చోరీ కాకుండా ఎంత పటిష్టమైన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంతలా అంటే కనీసం అతడి ఎల్‌ఈడీ బల్బును (LED bulb) కూడా ఎవరూ ఎత్తుకెళ్లలేని విధంగా ఏర్పాట్లు చేశాడు. అదెలా అని మీకు సందేహం కలుగుతోందా.

Viral Video: అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..


ఎల్ఈడీ బల్బుకు సైకిల్, బైకు హ్యాండిల్, హెల్మెట్‌‌కు వేసే లాక్‌ను వాడేశాడు. ప్లాస్టిక్ పైపును బల్బు మధ్యలో నుంచి రేకుల షెడ్‌కు జాయింట్ చేశాడు. తర్వాత దానికి ఎంచక్కా తాళం వేశాడు. ఇలా కనీసం తన ఎల్‌ఈడీ బల్బును కూడా ఎవరూ ఎత్తుకెళ్లకుండా విచిత్ర ఏర్పాట్లు చేశాడన్నమాట. కాగా, ఇతడి అతి తెలివిని చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: వామ్మో.. ఇదేం విన్యాసంరా బాబోయ్.. పామును నోట్లో పెట్టుకుని మరీ..


ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఇతడి తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 38 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 13 , 2024 | 03:28 PM