ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆత్మహత్యాయత్నం.. రైలు రావడం ఆలస్యమయ్యేసరికి పట్టాలపైనే కునుకు!

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:05 PM

రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్న ఓ యువతి రైలు రాక ఆలస్యం కావడంతో పట్టాలపైనే కునుకులోకి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఓ యువతిని కాపాడిన లోకో పైలట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. యువతి పట్టాలపై కదలకుండా పడి ఉండటం చూసిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు అపడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, రైలు రావడం ఆలస్యం కావడంతో యువతి అప్పటికే నిద్రలోకి జారుకున్నట్టు తెలిసింది ( Viral ).


జాతీయ మీడియా కథనాల ప్రకారం, యువతి ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. యువతికి కుటుంబసభ్యులు అంగీకారం తెలపకపోవడంతో ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక, విషయం తెలిసి గ్రామస్తులు అక్కడికి చేరుకుని యువతిని పట్టాలపై నుంచి పక్కకు తీసుకొచ్చారు. ఎందుకిలా చేశావని ప్రశ్నించగా ఆమె తనను వదిలిపెట్టాలని, తనకు చనిపోవాలని ఉందంటూ భావోద్వేగానికి లోననైంది (Bihar woman falls asleep on railway track while trying to end self).


యువతి చర్య కారణంగా రైలు రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దిన అనంతరం అధికారులు రైళ్లను పునరుద్ధరించారు.

కాగా, ఇటీవల వెలుగు చూసిన మరో ఘటనలో కూడా లోకో పైలట్ అప్రమత్తత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు దక్కాయి. సదరు వ్యక్తి రైలు పట్టాలపైనే నిద్రించాడు. ఎండ తగలకుండా గొడుగు కూడా అడ్డం పెట్టుకున్నాడు. దీంతో, లోకో పైలట్ దృష్టి అతడిపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో కూడా వైరల్ అయ్యింది.

Read Latest and Viral News

Updated Date - Sep 10 , 2024 | 09:10 PM

Advertising
Advertising