Share News

Viral Video: అదృష్టమే కాపాడింది.. డివైడర్‌ను ఢీకొని గాల్లోకి ఎగిరిన బైక్.. ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడంటే..

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:06 PM

అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సులభంగా తప్పించుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదృష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియోలోని ఓ బైకర్ ఘోర ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకున్నాడు.

Viral Video: అదృష్టమే కాపాడింది.. డివైడర్‌ను ఢీకొని గాల్లోకి ఎగిరిన బైక్.. ఆ వ్యక్తి ఎలా బయటపడ్డాడంటే..
Road Accident Video

అదృష్టవంతుడు సముద్రం మధ్యలో పడిపోయినా ఎలాగోలా ఒడ్డుకు వచ్చేస్తాడని సామెత. అదృష్టం (Luck) బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సులభంగా తప్పించుకోవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదృష్టం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ వీడియోలోని ఓ బైకర్ (Biker) ఘోర ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకున్నాడు. ఘోర ప్రమాదానికి గురైన ఆ వ్యక్తి అదృష్టాన్ని, ప్రశాంతమైన ప్రవర్తనను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).


@effucktivehumor అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బిజీ రోడ్డు మీద వేగంగా బైక్ నడుపుతున్న వ్యక్తి అదుపు తప్పి డివైడర్ ముందున్న ర్యాంప్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడి బైక్ గాల్లోకి ఎగిరింది. ఆ వ్యక్తి కూడా గాల్లోకి ఎగిరి ఎదురుగా వస్తున్న ట్రక్కు బానెట్‌ పైకి దూసుకెళ్లిపోయాడు. ఆ ట్రక్కు డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంత పెద్ద ప్రమదానికి గురైన వ్యక్తి ఆ ట్రక్కు నుంచి ప్రశాంతంగా దిగి తన బైక్ దగ్గరకు చేరుకున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.


ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.4 లక్షల మందికి పైగా వీక్షించారు. 2.5 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అదృష్టం అంటే ఇదే``, ``ఇది చాలా ఘోరంగా ముగిసి ఉండవచ్చు``, ``డివైడర్ ముందు ర్యాంప్ ఎందుకు ఉంది?``, ``అతడి ఆయుష్షు గట్టిది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ కళ్ల వపర్‌కు టెస్ట్.. గులాబీల మధ్యనున్న పీతను 10 సెకెన్లలో గుర్తించండి..


Viral Video: వామ్మో.. ఇదెక్కడి వింత జంతువు.. ఈ వీడియో చూస్తే భయంతో షాకవ్వాల్సిందే..


Viral Video: వామ్మో.. ఇలా అయితే ఎలా.. వేదిక మీదే కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్..


Optical Illusion Test: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నంగా ఉన్న కోడిని గుర్తించండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2024 | 03:06 PM