ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: నడిరోడ్డుపై పోలీసును నిలదీసిన బైకర్.. షాకింగ్ వీడియో!

ABN, Publish Date - Oct 12 , 2024 | 08:29 AM

నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగంగా ఉమ్మివేసిన పోలీసును ఓ బైకర్ నిలదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయకూడదన్న నిబంధన అనేక నగరాల్లో అమలవుతోంది. ఈ రూల్ ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధిస్తారు. అయితే, ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిన ఓ పోలీసే కట్టుతప్పాడు. అది చూసి తట్టుకోలేకపోయిన ఓ బైకర్ అతడిని పబ్లిక్‌గా నిలదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.

Viral: ఈ సంస్థలో ఉద్యోగులందరికీ ఏకంగా 9 రోజుల లీవ్! రిలాక్స్ అయ్యేందుకట!


మహారాష్ట్రలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసు వ్యాన్ వచ్చి ఆగింది. అయితే, అందులో ఉన్న ఓ పోలీసు కిటికీ లోంచి కిందకు ఉమ్మేశాడు. అక్కడే ఉన్న బైకర్‌కు ఈ దృశ్యం కంటపడేసరికి కోపం నషాళానికి అంటింది. అంతే, ఆ పోలీసు మీద బైకర్ ఇంతెత్తున లేచాడు. రోడ్డు మీద ఇలా చేయడం తప్పు కాదా అంటూ నిలదీశాడు. నీమీద ఎవరైనా ఉమ్మేస్తే ఊరుకుంటావా అంటూ మండిపడ్డాడు. అతడిని పోలీసులు శాంతపరిచే ప్రయత్నం చేసినా అతడు వెనకడుగు వేయలేదు. అయితే, వీడియో అక్కడితో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు.

Viral: ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శృతి హాసన్ ఆగ్రహం!


ఇక ఈ ఉదంతం నెట్టింట బాట పట్టి ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. బైకర్ ఉన్నత వ్యక్తిత్వంపై అనేక మంది ప్రశంసలు కురిపించారు. తప్పు జరిగినప్పుడు ధైర్యంగా ప్రశ్నించేవారే ప్రస్తుతం ఈ దేశానికి అవసరమని కొందరు వ్యాఖ్యానించారు. ఓపోలీసు చేసిన తప్పును పబ్లిక్‌గా ఎండగట్టావంటే నీవు నిజంగా గ్రేట్ బ్రదర్ అని మరో వ్యక్తి అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్ అవుతోంది.

Viral: విమానం నడుపుతన్న భర్తకు గుండెపోటు! ఒంటరైన భార్య ఊహించని విధంగా..

Read Latest and Viral News

Updated Date - Oct 12 , 2024 | 08:38 AM