ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bill Gates: బిల్ గేట్స్ సక్సెస్ కావడానికి ఈ అలవాట్లే కారణం..!

ABN, Publish Date - Jun 29 , 2024 | 02:21 PM

బిల్ గేట్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు. ఈయన ఒక సాంకేతిక నిపుణుడు, వ్యాపార వేత్త, ప్రపంచంలోని ధనవంతులలో మూడవ వ్యక్తి. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత. సామాన్యులకు కూడా కంప్యూటర్ ను అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఈయన. ఆయన తన జీవితంలో ఇంత గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఆయన అలవాట్లే కారణం.

బిల్ గేట్స్ ప్రపంచానికి పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు. ఈయన ఒక సాంకేతిక నిపుణుడు, వ్యాపార వేత్త, ప్రపంచంలోని ధనవంతులలో మూడవ వ్యక్తి. మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత. సామాన్యులకు కూడా కంప్యూటర్ ను అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి ఈయన. ఆయన తన జీవితంలో ఇంత గొప్ప వ్యక్తిగా ఎదగడానికి ఆయన అలవాట్లే కారణం అని అంటున్నారు. బిల్ గేట్స్ విజయానికి దోహదం చేసిన ఆ అలవాట్లేమిటో తెలుసుకుంటే..

ఖర్చులు..

బిల్ గేట్స్ తన ఖర్చులను నియంత్రించడంలో చాలా కరెక్ట్ గా ఉంటారట. ఆయన ఏదైనా పెద్ద ఖర్చు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించిన తరువాతే ఖర్చు చేస్తారట. దీంతో ఆయన తన దగ్గరున్న డబ్బును అనవసరంగా వృథా చేయడం అనేది జరగదు.

Black Chickpeas: నల్ల శనగలు ఇలా తిని చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!



ఆర్థిక ప్రణాళిక..

ఆర్థిక ప్రణాళిక ఎంత అవసరమో బిల్ గేట్స్ చాలా చక్కగా అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టారట. ఏదైనా ఖర్చు చేసేముందు బడ్జెట్ నుండి అన్ని కోణాలలోనూ ఆర్థిక విషయాలను ప్రణాళిక వేసుకుంటారు. దీనివల్ల ఆయన పెట్టే పెట్టుబడి నష్టాలు రాకుండా నిర్మూలిస్తుంది.

సింప్లిసిటీ..

ప్రపంచంలో అత్యంత ధనవంతులలో మూడవ వ్యక్తి అయినా ఈయన చాలా సింపుల్ గా ఉంటారట. దన అహంకారాన్ని ఎక్కడా చూపించరట. అన్ని కోట్లు ఉన్నా సరే.. ఈయన చేతికి కేవలం 10డాలర్ల విలువ చేసే గడియారం వాడుతున్నారట.

Indigestion: అజీర్తి వేధిస్తోందా? ఈ టిప్స్ తో తొందరగా తగ్గించేయచ్చు..!



పెట్టుబడులు..

ఈయన పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా, మరెంతో తెలివిగా ఉంటారట. నివేదిక ప్రకారం ఈయన దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందగలిగారట.

పుస్తకాలు..

గొప్పవాళ్లలో చాలామందికి పుస్తకాలు చదవడం అనే అలవాటు ఉండటం గమనించవచ్చు. బిల్ గేట్స్ కు కూడా పుస్తకాలు చదవడం అనే అలవాటు ఉందట. పుస్తక పఠనం మెదడుకు మంచి వ్యాయామం ఇస్తుందని, ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తుందని బిల్ గేట్స్ అంటారు. పుస్తకాలు చదవడం ఆయన అభిరుచులలో ఒకటి.

Immunity Herbs: ఈ 8 మూలికలు వాడండి చాలు.. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి బలపడుతుంది..!

Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.


Updated Date - Jun 29 , 2024 | 02:21 PM

Advertising
Advertising