Viral Video: ఈ పక్షుల తెలివి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వ్యక్తి గడ్డికి నిప్పు పెట్టగానే.. ఏం చేశాయో చూడండి..
ABN, Publish Date - Feb 03 , 2024 | 07:27 PM
మనిషి మంచి చెడు అనే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రస్తుత రోజుల్లో జంతువులు, పక్షులు.. అనేక సార్లు తమను చూసి నేర్చుకోమంటూ సందేశాలు ఇస్తుంటాయి. కొన్నిసార్లు వీటి చేష్టలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి...
మనిషి మంచి చెడు అనే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రస్తుత రోజుల్లో జంతువులు, పక్షులు.. అనేక సార్లు తమను చూసి నేర్చుకోమంటూ సందేశాలు ఇస్తుంటాయి. కొన్నిసార్లు వీటి చేష్టలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చెక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గడ్డికి నిప్పు పెట్టగానే.. కొన్ని పక్షులు ఆ మంటలను వెంటనే ఆర్పేసిన వీడియో చూసి నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని పక్షులు గడ్డి వద్ద ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడికి వెళ్లి పక్షి తెలివిని పరీక్షిస్తాడు. వాటి దగ్గరకు వెళ్లి గడ్డికి నిప్పు పెడతాడు. మంట మొదలవగానే పక్షులు వెంటనే స్పందిస్తాయి. మూడు పక్షులూ మంట చుట్టూ చేరి వాటి ముక్కు, రెక్కల సాయంతో (Birds tried to put out the fire) మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తాయి. మంటపై ముక్కులతో పొడుస్తూ, రెక్కలను మంటపై కప్పుతూ ఇలా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తాయి.
Viral Video: ఓ వైపు పిల్లాడి మొండి పట్టు.. మరోవైపు పట్టు వదలని జిరాఫీ.. చివరకు చూస్తే..
మంట వేడికి ముక్కులు కాలుతున్నా పట్టించుకోకుండా మంటను పూర్తిగా ఆపేస్తాయి. ‘‘అడవులు నిప్పు పెట్టి అనేక జంతువులు, పక్షుల మరణాలకు కారణమయ్యే వారు.. ఇప్పటికైనా మారండి’’.. అంటూ సందేశం ఇచ్చినట్లునట్లుగా ఈ పక్షులు ప్రవర్తన ఉంటుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పక్షుల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలు పోతాయానే భయం లేకుండా మంటలను ఆర్పేయడం నిజంగా అద్భుతం’’.. అంటూ మరికొందరు, ‘‘ఈ పక్షులను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - Feb 03 , 2024 | 07:27 PM