ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Indian Railways: గూగుల్‌నే నమ్ముకుందేమో కానీ.. రైల్వేకు ఊహించని షాక్!

ABN, Publish Date - Apr 15 , 2024 | 04:55 PM

అనువాద దోషం కారణంగా ఓ ఎక్స్‌ప్రెస్ పేరులో హంతకుడు పదం వచ్చి చేరింది. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఉదంతంపై స్పందించిన రైల్వే శాఖ తప్పును సరిదిద్దుకున్నట్టు తెలిపింది.

Bizzare Translation of Indian Express train name

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచమంతా ఇంటర్నెట్‌తో అనుసంధానమైన వేళ గూగుల్ ఉత్పత్తులు లేకుండా పూట కూడా గడవని పరిస్థితి. కానీ ఒక్కోసారి గూగుల్ ఇచ్చే షాకులకు జనాలు లబోదిబోమంటుంటారు. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ వినియోగించిన వాళ్లు ఇలాంటి పరిస్తితి ఎప్పుడోకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. ఇక గూగుల్ చేసే అనువాదాల (Google Translate) సంగతి సరే సరి. తాజాగా ఇలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ షాక్‌కు ఏకంగా రైల్వే శాఖ (Indian Railways) విలవిల్లాడిపోయింది. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: ప్యాంటు వేసుకోకపోతే బ్యాంకులోకి రానివ్వరా? కోపంతో ఊగిపోయిన కస్టమర్! జరిగిందేంటంటే..


అనువాదం కారణంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలు పేరు అసంబద్ధంగా మారిపోయిన ఉదంతం ఉంది. ఝార్ఖండ్‌, కేరళ మధ్య రాకపోకలు సాగించే ‘హాథియా-ఎర్ణాకులం’ రైలు (Hatiya-Ernakulam Express) అనువాదం కారణంగా అపసవ్యంగా మారింది. హిందీలోని హాథియా పేరును మళయాళంలోకి తప్పుగా అనువదించడంతో అది హంతకుడు అనే అర్థం వచ్చే పదంగా మారింది. ఈ తప్పుడు పేరున్న బోర్డును రైలుకు తగిలించడం ఇది మళయాళం తెలిసివాళ్ల కంట పడటంతో నెట్టింట నవ్వులు పూసాయి.

హాతియా అనే పేరును హంతకుడిగా మారిపోవడంతో జనాలు పడిపడీ నవ్వుకున్నారు. రైల్వే శాఖ కూడా గూగుల్‌ను నమ్ముకుని నట్టేట మునిగిందంటూ రచ్చరచ్చ చేశారు. వైరల్‌గా మారిన ఈ ఉదంతం చివరకు రైల్వే దృష్టికి వెళ్లడంతో అధికారులు స్పందించారు. అంశం తమ దృష్టికి రాగానే తప్పును సరిదిద్దామని రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు. కానీ, ఈ ఉదంతం మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది (Bizarre Translation Of Stations Name Shocks Internet).


ఇటీవల కాలంలో రైల్వే శాఖ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న విషయం తెలిసిందే. రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ, రీల్స్ పేరిట జనాల విపరీత చేష్టలు వంటి ఘటనలతో తరచూ రైలు టాపిక్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇటీవల ఓఖా-బనారస్ రైల్లో రద్దీ చూసిన ఓ యువతి ఎలా ప్రయాణించాలో తెలీక టీటీఈకి ఫిర్యాదు చేసింది. అదనపు రైళ్లు వేసేందుకు తానేమీ రైల్వే మంత్రిని కాదంటూ ఆ టీటీఈ సమాధానం ఇవ్వడంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 05:01 PM

Advertising
Advertising