ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

ABN, Publish Date - Oct 20 , 2024 | 07:45 PM

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ ఆన్‌లైన్ వివాహం జరిగింది. జౌన్‌పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.

వస్తువులు.. విక్రయాలు, కొనుగోలు అన్ని ఆన్‌లైన్‌లోనే. ప్రపంచంలో ఏ మూల ఏ వస్తువునైనా.. ఈ ఆన్‌లైన్‌‌‌ ద్వారా కొనుగోలు చేస్తే.. కొన్ని గంటల్లో మన చేతుల్లోకి వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ సేవలకు బాగా గిరాకీ పెరిగింది. అయితే ఓ జంట ఆన్‌‌లైన్‌లో వివాహం చేసుకుంది. అదీకూడా పెద్దల సమక్షంలో.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: BSNL Vs Jio: జియోను వెనక్కి నెట్టిన బీఎస్ఎన్ఎల్.. మరికొద్ది రోజుల్లో..


ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో ఈ ఆన్‌లైన్ వివాహం జరిగింది. జౌన్‌పూర్ బీజేపీ కార్పొరేటర్ తహసీన్ షాహిద్ తన పెద్ద కుమారుడు మహమ్మద్ అబ్బాస్ హైదర్‌కు వివాహం చేయాలని నిశ్చయించారు. ఆ క్రమంలో పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన ఆండ్లీప్ జహ్రాతో సంబంధం కుదిరింది. వీరి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అందుకు ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు.

Also Read: Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం.. ఐ ఫోన్ 15 ధర ఎంతంటే..?


అయితే ఇరుగు పోరుగు దేశాలు.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో వీసా జారీ ప్రక్రియను భారత్ దాదాపుగా నిలిపివేసింది. దీంతో వధువు ఆండ్లీప్ జహ్రాకు వీసా మంజూరు కాలేదు. మరో వైపు వధువు తల్లి రానా యస్మిన్ జైదీ తీవ్ర అనారోగ్యం పాలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Also Read: HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు


అలాంటి వేళ.. వధువు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని వధువు కుటుంబ సభ్యులు వరుడు తండ్రి షాహిద్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో వరుడు తండ్రి షాహిద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన పెద్ద కుమారుడి వివాహం వీడియో‌ కాల్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహిద్దామని సూచించారు.

Also Read: Secunderabad Bandh: సికింద్రాబాద్‌లో బంద్.. ఆందోళనకారులపై కేసు నమోదు


వధువు కుటుంబ సభ్యుల సైతం అందుకు ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం రాత్రి జౌన్‌పూర్‌లో.. లాహోర్‌లో ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. దీంతో షియా వర్గానికి చెందిన మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ వివాహం జరిగింది. దాంతో వీరిద్దరు ఆన్‌లైన్‌లో దంపతులుగా మారారు.

Also Read: ఉలవలు ఆహారంగా తీసుకోవడం వల్ల.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?


ఈ వివాహ వేడుక అనంతరం వరుడు హైదర్ మాట్లాడుతూ.. తన భార్యకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భారతీయ వీసా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్సీ బ్రిజేష్ సింగ్ ప్రిషుతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుడు హైదర్‌కు వారంతా శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్నీ ప్రత్యేక విశేషాలతోపాటు తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 20 , 2024 | 08:45 PM