ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dog: బాబీ సాహసం..

ABN, Publish Date - Oct 06 , 2024 | 09:50 AM

నాలుగువేల కిలోమీటర్ల దూరం... ఆరునెలల పాటు ఏకధాటిగా పరుగు... తన ఇంటిని చేరుకోవడానికి ఒక కుక్క చేసిన సాహసం. ఆ కుక్క పేరు బాబీ. వందేళ్లు గడిచినా అక్కడి ప్రజలు ఇంకా బాబీ సాహసాన్ని, యజమానిపై దానికున్న ఇష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

నాలుగువేల కిలోమీటర్ల దూరం... ఆరునెలల పాటు ఏకధాటిగా పరుగు... తన ఇంటిని చేరుకోవడానికి ఒక కుక్క చేసిన సాహసం. ఆ కుక్క పేరు బాబీ. వందేళ్లు గడిచినా అక్కడి ప్రజలు ఇంకా బాబీ సాహసాన్ని, యజమానిపై దానికున్న ఇష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

సిల్వర్టన్‌లో నివసించే ఫ్రాంక్‌, ఎలిజబెత్‌ దంపతులకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు లియోనా, నోవా. వీరితో పాటు ఆ కుటుంబంలో ఒక కుక్క కూడా ఉండేది. దాని పేరు బాబీ. ప్రతీరోజూ సాయంత్రం బాబీతో లియోనా, నోవాలు ఆడుకునేవారు. బాబీ చాలా తెలివైనది. కుటుంబసభ్యులు బయటకు ఎక్కడకు వెళ్లినా తమతో పాటు తప్పకుండా కారులో బాబీని తీసుకెళ్లేవారు. పరిసరాలను గమనించడం, వాసనలను పసిగట్టడంలో బాబీ దిట్ట.


తప్పిపోయి... ఆరు నెలలు...

1923లో ఫ్రాంక్‌ కుటుంబం వేసవి సెలవుల్లో ఇండియానాలోని వొల్కట్‌లో ఉన్న వారి బంధువులను కలిసేందుకు కారులో బయలుదేరారు. కుటుంబసభ్యులతో పాటు యథాలాపంగా బాబీని కూడా తీసుకెళ్లారు. ఓపెన్‌టాప్‌ కారులో వెనకా సీట్లో గాలిని ఆస్వాదిస్తూ, పరిసరాలను గమనిస్తూ కూర్చుంది బాబీ. చాలా దూరం కాబట్టి మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ... వారం రోజుల పాటు ప్రయాణించి ఫ్రాంక్‌ కుటుంబం వోల్కట్‌కు చేరుకుంది. వోల్కట్‌లో కారులో ఇంధనం నింపుకొనేందుకు ఆగిన సమయంలో కొన్ని వీధి కుక్కలు బాబీని తరిమాయి. భయంతో వాటికి చిక్కకుండా బాబీ పరుగెత్తింది. మళ్లీ తిరిగి వస్తుందేమోనని ఫ్రాంక్‌ చాలాసేపు ఎదురుచూశారు.


కానీ అది తిరిగిరాలేదు. దాంతో చేసేదేం లేక ఫ్రాంక్‌ కుటుంబం అక్కడి నుంచి బయలుదేరింది. ఆ తరువాత తమ కుక్క ఆచూకీ తెలపాలని కోరుతూ పోస్టర్లు ప్రింట్‌ చేయించి వేయించారు. అయినా ఫలితం లేదు. కానీ సరిగ్గా ఆరు నెలల తరువాత బాబీ సిల్వర్టన్‌లోని తన ఇంటికి చేరుకునేసరికి అంతా ఆశ్చర్యపోయారు. దాని కాళ్లు బొబ్బలెక్కిపోయి ఉన్నాయి. పూర్తిగా చిక్కిపోయింది. ఒక కుక్క అంతదూరం నుంచి ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. రోజుకి సగటున 20 కిలోమీటర్లు పరుగెత్తింది బాబీ. అలా ఆరునెలల పాటు పరుగెత్తి యజమాని ఇంటికి చేరుకుంది.


ఎలా సాధ్యం?

ఫ్రాంక్‌ కుటుంబం వొల్కట్‌కు వెళ్లేటప్పుడు దారిలో కారులో ఇంధనం నింపుకొన్నారు. ఆ స్టేషన్లను బాబీ బాగా గుర్తుపట్టింది. భోజనం కోసం, రాత్రి విశ్రాంతి కోసం హోటళ్లలో బస చేశారు. వాటిని కూడా గుర్తుపట్టి సరైన దారిలో వచ్చింది. గాలిలో వచ్చే ప్రత్యేకమైన వాసనలను గుర్తుపట్టింది. అలా ఇంటికి చేరింది. ఈ ప్రయాణంలో బాబీకి ఎంతో మంది ఆహారం అందించారు. విషయం తెలిసిన తర్వాత ‘బాబీ ఎలా ఇంటికి చేరి ఉంటుంద’నే విషయంపై ఒక స్వచ్ఛంద సంస్థ పరిశోధన చేసి, ఈ ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చివరకు 1927లో బాబీ చనిపోయింది. బాబీ జ్ఞాపకార్థం అక్కడ ఒక విగ్రహాన్ని నెలకొల్పారు. సిల్వర్టన్‌లో రద్దీగా ఉండే వీధిలో 70 అడుగుల గోడపై బాబీ జీవితచరిత్రను తెలిపే బొమ్మలు వేశారు. మనుషులతో పోలిస్తే కుక్కలకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి ఉంటుందన్న విషయం ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైందంటారు జంతు ప్రేమికులు.

Updated Date - Oct 06 , 2024 | 10:47 AM