Viral: గర్ల్‌ఫ్రెండ్‌కు పెళ్లి ప్రపోజల్.. ఐస్‌క్రీమ్‌లో ఉంగరం దాచి తినమని ఇస్తే..
ABN, Publish Date - May 18 , 2024 | 03:03 PM
పెళ్లి ఉంగరం ఉన్న ఐస్‌క్రీమ్‌తో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేద్దామనుకున్న ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఆమె ఐస్ క్రీమ్ అంతా తినేసినా పెళ్లి ఉంగరం కనబడకపోవడంతో అతడు షాకైపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తనను పెళ్లి చేసుకోమని గర్ల్‌ఫ్రెండ్‌ను అడుగుదామనుకున్నాడో వ్యక్తి. ఆమెను సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఐస్‌క్రీమ్‌లో పెళ్లి ఉంగరం దాచి ఆమెకు ఇచ్చాడు. ఐస్‌క్రీమ్ తినేటప్పుడు నోటికి ఉంగరం తగిలి ఆమె సర్ప్రైజ్ అయితే అప్పుడు తన మనసులో మాట బయటపెట్టాలనేది అతడి ప్లాన్. అంతవరకూ బానే ఉన్నా ఆ తరువాత గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన మరో ట్విస్ట్‌కు అతడికి దిమ్మతిరిగినంత పనైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.
Viral: పిల్ల మొసలి తెలివితేటలు సూపర్.. చావును ఎలా తప్పించుకుందో చూడండి!
నెటిజన్ల ప్రకారం ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగినట్టు తెలుస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి పెళ్లి ప్రస్తావనతో గర్ల్‌ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాడు. పెళ్లి ఉంగరం దాచి ఉంచిన ఐస్‌క్రీమ్ ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె కొంచెం కొంచెం ఐస్‌క్రీమ్ తింటుంటే అతడేమో ఉత్కంఠగా ఎదురు చూశాడు. కానీ ఆమె ఐస్‌క్రీమ్ మొత్తం తినేసినా ఉంగరం జాడ మాత్రం కనిపించలేదు. దీంతో, దిమ్మెరపోవడం ఆమె బాయ్‌ఫ్రెండ్ వంతైంది (Boy Wanted To Surprise Girlfriend Hiding Ring In Ice Cream, Here's What Happened Next).
ఈ వీడియో చూసి జనాలు షాకైపోతున్నారు. ఐస్‌క్రీమ్ మొత్తం తినేసినా ఆమె నోటికి ఉంగరం తగలకపోవడం ఏంటో ఎవరికీ అంతుపట్టలేదు. ఈ క్రమంలో కొందరు వీడియోపై అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం ఎవరో కనికట్టు చేసి ఉంటారని, ఉంగరం లేని మరో ఐస్‌క్రీమ్‌ను యువతి తిని ఉండొచ్చని కామెంట్ చేశారు. నిజానిజాలు ఏమైనప్పటికీ వీడియో మాత్రం జనాలను తెగ ఎంటర్టైన్ చేస్తూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
Updated Date - May 18 , 2024 | 03:09 PM