ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ప్రియురాలితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడతాడనుకుంటే.. వామ్మో!.. ఇతనేంటీ చివరకు ఇలా చేశాడు..

ABN, Publish Date - Feb 20 , 2024 | 05:51 PM

ప్రేమికుల మధ్య అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా ఒకరిపై ఇంకొకరు అనుమానం పెంచుకోవడం వల్లే గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో..

ప్రేమికుల మధ్య అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రధానంగా ఒకరిపై ఇంకొకరు అనుమానం పెంచుకోవడం వల్లే గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రేయసిపై ప్రియుడు దాడులకు పాల్పడితే.. మరికొన్నిసార్లు ప్రియుడిపై ప్రేయసి కక్ష తీర్చుకుంటూ ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. స్విమ్మింగ్ పూల్ వద్ద సేద తీరుతున్న ప్రియురాలి వద్దకు ప్రియుడు వెళ్లాడు. ఆమెతో కలిసి స్విమ్మింగ్ చేస్తాడునుకుంటే.. చివరకు ఏం చేశాడో మీరే చూడండి..

ఈ సంఘటన మలేషియా (Malaysia) హోటల్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌కు (Bengal) చెందిన వ్యక్తి.. ప్రియురాలు మలేషియాలో ఉంటోంది. అయితే ఇటీవల ఆమె గర్భవతి అని అతడికి తెలిసింది. దీంతో అతను నేరుగా మలేషియాకే వెళ్లాడు. ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ (Swimming pool) వద్ద సేద తీరుతున్న ఆమె వద్దకు వెళ్లాడు. వెళ్లిన కొద్ది సేపటికే ఆమెను దుర్బాషలాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఆమె అక్కడి నుంచి కాస్త దూరంగా వెళ్లి బెంచిపై కూర్చుంది. అయినా అతను ఆమె వద్దకు వెళ్లి మరీ వాగ్వాదం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి మరింత ఆగ్రహంతో ఆమె జుట్టు పట్టుకుని స్మిమ్మింగ్ పూల్ వద్దకు ఈడ్చుకుంటూ వెళ్లాడు.

Viral Video: ఈత కొట్టేందుకు బావిలోకి వెళ్లగా.. కదలకుండా పడి ఉన్న పాము.. ఏమైందబ్బా..! అని దగ్గరికి వెళ్లి చూడగా..

నీళ్లలో తోసేసి దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె అతని నుంచి విడిపించుకునే ప్రయత్నంలో అతడి జుట్టును కూడా పట్టుకుంది. తర్వాత అతను ఆమెను వదలేసి పక్కకు వెళ్లి నిలబడ్డాడు. తనపై అకారణంగా దాడి చేసినందుకు.. అతడి వద్దకు వెళ్లి ఆగ్రహంతో చేత్తో పక్కకు నెట్టి మరీ నిలదీసింది. దీంతో అతను సైలెంట్‌గా అలాగే నిలబడిపోయాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మహిళ అని కూడా చూడకుండా దాడి చేయడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ మరికొందరు, ‘‘ఈమె ధైర్యానికి సెల్యూట్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: గేమ్ ఛేంజర్... క్రికెట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ మొదలెట్టిన ఎద్దు.. చివరికి ఏమైందంటే..

Updated Date - Feb 20 , 2024 | 06:02 PM

Advertising
Advertising