ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: హాస్టల్‌ విద్యార్థి ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో అందరిలో టెన్షన్! పోలీసులు వచ్చి చూస్తే..

ABN, Publish Date - Mar 19 , 2024 | 07:39 PM

హాస్టల్‌ విద్యార్థి ఎంతకీ గది తలుపులు తెరవకపోవడంతో అందరిలో టెన్షన్! అతడు గాఢ నిద్రలో ఉన్నాడని తెలిసీ వెల్లివిరిసిన నవ్వులు

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని కోటా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఐఐటీ, నీట్ కోచింగ్‌ సెంటర్‌లే. ఇటీవల కాలంలో అక్కడి విద్యార్థులపై చదువుల ఒత్తిడి, ఆత్మహత్యల ఘటనలూ సంచలనంగా మారాయి. ఈ ఘటనలను నివారించేందుకు అక్కడి విద్యాసంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో వెలుగు చూసిన ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా (Viral Video) మారింది.

World's Longest Dosa: ప్రపంచంలో అత్యంత పొడవైన దోశ ఇదే! సైజ్ చూస్తే ఆశ్చర్యపోతారు!


అక్కడ ఓ హాస్టల్ గదిలో విద్యార్థి ఉన్నాడు. ఆ రోజు అతడు ఎంతకీ తన గది తలుపులు తెరవకపోవడంతో మిగతా వారిలో టెన్షన్ మొదలైంది. దీంతో, వారు పోలీసులను పిలిపించారు. పోలీసు వచ్చి గది గొళ్లేన్ని సుత్తితో పగలగొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ ఓ విద్యార్థి మంచంపై దుప్పటి ముగేసుకుని పడుకుని ఉన్నాడు. అతడిని తట్టిలేపగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అతడు క్షేమంగానే ఉన్నాడని తెలిసి అంతా ఊపిరిపీల్చుకున్నారు. అప్పటివరకూ ఉన్న టెన్షన్ అంతా ఒక్కసారిగా మటుమాయం కావడంతో విద్యా్ర్థులు, హాస్టల్ సిబ్బంది గొల్లున నవ్వారు. తలుపులు బద్దలు కొడుతున్నా వినిపించనంత మొద్దు నిద్రలో (Boys deep sleep) ఉన్న ఆ టీనేజర్‌ను చూసి పడీపడీ నవ్వుకున్నారు (hilarious emergency situation in hostel).

Viral: సముద్రగర్భంలో దాగున్న వేల కోట్ల నిధి.. వెలికి తీసేందుకు రంగంలోకి దిగిన కంపెనీ!


ఇక వీడియో నెట్టింట కూడా వైరల్ కావడంతో జనాల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. పెద్ద శబ్దాలు కూడా వినిపించనంత గాఢ నిద్రలో ఉన్నాడంటే ఆ కుర్రాడు ఎంత అలసిపోయి ఉంటాడోనని కొందరు కామెంట్ చేశారు. ఆధునిక చదువులు విద్యార్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 07:43 PM

Advertising
Advertising