Viral: పెళ్లి వేదిక మీదే వరుడితో వధువు తెగదెంపులు! కారణం తెలిస్తే..
ABN, Publish Date - Nov 26 , 2024 | 06:23 PM
నెలకు రూ.1.2 లక్షల జీతం తెస్తున్న వరుడితో పెళ్లి కాదన్న ఓ యువతి ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లో సంచలనంగా మారింది. వరుడి గురించి చివరి నిమిషంలో తెలిసిన విషయం ఆమెను పెళ్లి మండపంలోనే తెగదెంపులు చేసుకునేలా చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నెలకు రూ.1.2 లక్షల జీతం తెస్తున్న వరుడితో పెళ్లి కాదన్న ఓ యువతి ఉదంతం ఛత్తీస్‌గఢ్‌లో సంచలనంగా మారింది. వరుడి గురించి చివరి నిమిషంలో తెలిసిన విషయం ఆమెను పెళ్లి మండపంలోనే తెగదెంపులు చేసుకునేలా చేసింది. ఎవరెన్ని చెప్పినా వధువు భీష్మించుకుని కూర్చోవడంతో చేసేదేమీ లేక వరుడి కుటుంబం వెనుదిరిగింది (Viral).
Viral: తొలిసారి గులాబ్ జామూన్ ట్రై చేసిన కొరియా యువతి! ఆమె రియాక్షన్ చూస్తే..
పూర్తి వివరాల్లోకి వెళితే, బల్‌రామ్‌పూర్‌కు చెందిన ఓ ఇంజినీర్ యువకుడితో ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. వరుడు ప్రభుత్వ ఇంజినీర్ అని, కన్నౌజ్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారని మధ్యవర్తి ఒకరు వధువు కుటుంబానికి చెప్పారు. అతడికి ఆరు ప్లాట్లు ఉన్నాయని, 20 బీఘాల వ్యవసాయ భూమి కూడా ఉందని అన్నారు.
వధువు కుటుంబానికి ఇదంతా నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇక పెళ్లి సందర్భంగా దర్వాచార్, జయమాల కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలోనే వధువుకు వరుడి ఉద్యోగం గురించి పూర్తి వివరాలు అందాయి. అతడిది ప్రభుత్వ ఉద్యోగం కాదని, ప్రైవేట్ జాబ్ అని తెలిసింది. దీంతో, వెంటనే ఆమె అతడిని వివాహం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది.
Viral: త్రేన్పులు రాని, అపానవాయువు వదలని వరుడు కావాలంటూ పేపర్లో యాడ్!
తనకు ప్రభుత్వం ఉద్యోగం చేసే వ్యక్తే కావాలని, ప్రైవేటు జాబ్ చేసే వ్యక్తి అస్సలు వద్దని తేల్చి చెప్పింది. ఇది విన్న రెండు కుటుంబాల వారూ షాకైపోయారు. ఆమెకు నచ్చచెప్పేందుకు రకరకాలుగా ప్రయత్నించారు. కానీ ఆమె మాత్రం ఒక్క మెట్టు కూడా కిందకు దిగలేదు. చివరి ప్రయత్నంగా వరుడు తన కార్యాలయానికి ఫోన్ చేసి తన శాలరీ స్లిప్‌ను తెప్పించుకున్నాడు. అందులో అతడి జీతం నెలకు రూ.1.2 లక్షలుగా తేలింది. ఇది చూసిన తరువాత కూడా వధువు మనసు కరగలేదు. అతడిని పెళ్లి చేసుకునేదే లేదని మొండికెత్తింది. చివరకు చేసేందేమీలేక ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి. అప్పటివరకూ అయిన ఖర్చును ఎవరు భరించాలనే విషయంలో వారు ఓ అంగీకారానికి వచ్చాక వరుడి కుటుంబం పెళ్లి వేదికను వదిలిపెట్టి వెళ్లిపోయింది. దీంతో, ఈ ఉదంతం చర్చనీయాంశమైంది.
Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..
Viral: తల్లి ఆనందం కోసం పోలీసు అవతారమెత్తిన నిరుద్యోగ యువతి! చివరకు..
Updated Date - Nov 26 , 2024 | 06:26 PM