ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఎవర్రా మీరు.. పెళ్లికి వచ్చారా? ఊరును దోచుకోవడానికి వచ్చారా? వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN, Publish Date - Jun 07 , 2024 | 04:55 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత కీలకమైన ఘట్టం. అలాంటి వేడుకకు సంబంధించిన ప్రతి విషయమూ ప్రత్యేకంగా ఉండాలని వధూవరులు కోరుకుంటారు. ముఖ్యంగా అందరికీ గుర్తుండిపోయేలా విభిన్నంగా ఉండేందుకు రకరకాల ప్లాన్లు చేస్తుంటారు.

Bride entry

పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అత్యంత కీలకమైన ఘట్టం. అలాంటి వేడుకకు సంబంధించిన ప్రతి విషయమూ ప్రత్యేకంగా ఉండాలని వధూవరులు కోరుకుంటారు. ముఖ్యంగా అందరికీ గుర్తుండిపోయేలా విభిన్నంగా ఉండేందుకు రకరకాల ప్లాన్లు చేస్తుంటారు. ముఖ్యంగా వధూవరుల ఎంట్రీ విషయంలో క్రియేటివిటీ పీక్స్‌కు చేరుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Wedding Video) చూస్తే వారి క్రియేటివిటీకి షాకవ్వాల్సిందే. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది (Viral video).


aman.vlogs అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ కార్యక్రమానికి సంబంధించిన వేడుక జరుగుతోంది. బరువైన లెహంగా ధరించిన వధువు (Bride) కార్ బానెట్‌పై కూర్చుని ఉంది. కారు వెళ్తుండగా వధువు సోదరుడు దానిపై నిల్చున్నాడు. అతడి చేతిలో టపాసుల పెట్టె ఉంది. దానిన నుంచి టపాసులు గాల్లోకి ఎగిరి పేలుతున్నాయి. ఆ ధ్వనులకు వధువు కూడా భయపడుతోంది. ఇక, ఆ కారుకు నలువైపులా కొందరు వ్యక్తులు వేలాడుతూ వెళుతున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 55 లక్షల మంది వీక్షించారు. 1.9 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మీరు పెళ్లి చేసుకోవడానికి వచ్చారా లేదా గ్రామాన్ని దోచుకోవడానికి వచ్చారా ``, ``బంధిపోటు దొంగల్లా ఉన్నారు``, ``ఇది ఏ ముఠా వివాహం``, ``ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: చైనాలో కొత్త ట్రెండ్.. ఆఫీస్ డెస్క్‌ల వద్ద ఆరటి పళ్లను పండిస్తున్న ఉద్యోగులు.. ఎందుకో తెలిస్తే..


Viral Video: గాల్లో ఒళ్లు గగుర్పొడిచే ఫైటింగ్.. చేప కోసం రెండు పక్షుల పోరాటం.. చివరకు ఏం జరిగిందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2024 | 04:55 PM

Advertising
Advertising