Viral: వరుడు రసగుల్లా తినలేదని చెంప ఛెళ్లుమనిపించిన వధువు! షాకింగ్ వీడియో!
ABN, Publish Date - Jun 02 , 2024 | 01:17 PM
పెళ్లి వేదికపై వరుడి చెంప ఛెళ్లుమనిపించిన వధువు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది నిజమా ప్రాంక్ వీడియోనా అర్థం కాక జనాలు తలబాదుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి వేదికపై వరుడి చెంప ఛెళ్లుమనిపించిన వధువు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది. ఇది నిజమా ప్రాంక్ వీడియోనా అర్థం కాక జనాలు తలబాదుకుంటున్నారు. కొందరు పడీపడీ నవ్వుకుంటూ సెటైర్లు పేల్చారు. నెట్టింట రకరకాల కామెంట్స్ కు దారి తీసిన ఈ వీడియో వివరాల్లోకి వెళితే..
వివాహం సందర్భంగా వధువు వరుడికి వరమాల వేసింది. ఆ తరువాత అతడికి నోట్లో రసగుల్లా పెట్టపోతే అతడు వద్దన్నాడు. ఆమె రెండు సార్లు ప్రయత్నించినా అతడు వద్దని ముఖం తిప్పుకున్నాడు. దీంతో, వధువుకు తిక్కరేగింది. బలవంతంగా అతడి నోట్లో రసగుల్లా పెట్టి ఆపై చెంప ఛెళ్లు మనిపించింది.
Viral: బాస్ తనని తెగ తిడుతున్నాడని ఈ యువతి ఏం చేసిందంటే..
వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోయారు. సంతోషం అంబరాన్నంటాల్సిన పెళ్లిలో ఇదేం గొడవని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రసగుల్లా తినేందుకు వరుడికొచ్చిన ఇబ్బందేంటని కొందరు ప్రశ్నించాడు. రసగుల్లా తిననంత మాత్రాన చేయి చేసుకోవాలా అని మరొకరు ప్రశ్నించారు. ఇదంతా ఏదో ప్రాంక్ వీడియోలా ఉందని కొందరు అన్నారు. అసలు కారణంమేంటనేది తెలియకపోవడంతీ జనాలు రకరకాల కామెంట్స్ చేశారు. దీంతో, వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది.
కాగా, వధూవరుల గొడవలకు సంబంధించి గతంలోనూ ఇలాంటి వీడియోలు అనేకం వెలుగు చూశాయి. వీటిల్లో కొన్ని ప్రాంక్ వీడియోలుగా తేలాయి. అయితే, పెళ్లి మొదట్లోనే ఇలా వధూవరులు గొడవపడంపై అనేక మంది పెదవి విరిచారు. ఇలాగైతే జీవితాంతం వారు ఎలా కలిసుండగలరని ప్రశ్నించారు.
Updated Date - Jun 02 , 2024 | 01:17 PM