ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆఫీసులో అలసిపోయి వచ్చిన భార్య కోసం వంట వండని భర్త! చివరకు..

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:16 PM

రాత్రి ఆఫీసు నుంచి వచ్చే సరికి తనకు వంట రెడీ చేసుంచుతానని మాటిచ్చిన భర్త చివరకు హ్యాండివ్వడంతో ఓ మహిళ విడాకులకు సిద్ధమైంది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: రాత్రి ఆఫీసు నుంచి వచ్చే సరికి తనకు వంట రెడీ చేసుంచుతానని మాటిచ్చిన భర్త చివరకు హ్యాండివ్వడంతో ఓ మహిళ విడాకులకు సిద్ధమైంది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనం రేపుతోంది (Viral). తనంటే గౌరవం లేని వ్యక్తితో కలిసుండాలా అన్న ఆమె ప్రశ్న నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది.

Viral: జొమాటో, స్విగ్గీల్లో త్వరగా డెలివరీలు రావాలంటే ఇలా చేయండి: నెటిజన్


స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆఫీసులో దాదాపు 12 గంటలు పని చేసి అలసి ఇంటికొచ్చిన తనకు వంట చేసి రెడీగా ఉంచుతానని మాటిచ్చిన భర్త చివరకు మాటతప్పాడని ఆమె ఆరోపించింది. గత కొన్ని రోజులుగా తాను ఆఫీసు పనుల్లో తీరిక లేకుండా ఉంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితిల్లో తాను వంట చేస్తానని భర్త మాటిచ్చాడని వివరించింది. కానీ ఇటీవల ఓ రోజు 12 గంటల షిఫ్టు ముగించుకుని రాత్రి వేళ ఇంటికి తిరిగొస్తే ఖాళీ గిన్నెలు కనిపించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది (British Woman Considers Divorce After Husband Fails To Cook Dinner As Promised).

Viral: వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

వంట చేస్తానని మాటిచ్చి ఎందుకు తప్పావని ప్రశ్నిస్తే తనకు ఆ రోజు ఎందుకో వండ బుద్ధికాలేదని అత్యంత నిర్లక్ష్యంగా భర్త సమాధానమిచ్చాడని మహిళ తెలిపింది. ఇంటి విషయాల్లో తన భర్త నిర్లక్ష్యంగా ఉంటున్నాడని ఆమె ఆరోపించింది. సెలవు రోజుల్లో ఇంటి పని గురించి పట్టించుకోకుండా రోజంతా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ గడిపేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. భార్యాభర్తలిద్దరూ ఇంటి పనులను పంచుకోవాలని, కలిసి మెలిసి సమన్వయంతో పనులు చక్కబెట్టుకోవాలని ఎంతగా చెబుతున్నా అతడు అర్థం చేసుకోవట్లేదని వాపోయింది. తన చెప్పేది అర్థం చేసుకోకపోగా చిరాక పడుతుంటాడని కూడా వివరించింది.

Viral: షాకింగ్..నవజాత శిశువుతో పాలసీసా శుభ్రం చేయించిన వైనం!


ఇక ఆ రోజు రాత్రి ఆఫీసు నుంచి అలసి సొలసి ఇంటికొచ్చిన తనకు మాటిచ్చిన ప్రకారం వంటి రెడీ చేసి ఉంచకపోవడంతో కోపం నషాళానికి అంటిందని చెప్పింది. చివరకు తాను బయట హోటల్‌ను తన కోసం భోజనం తెచ్చుకున్నానని, భర్తకు మాత్రం ఏమీ తేలేదని తెలిపింది. ఆ తరువాత మరుసటి రోజు రాత్రికి కూడా తన వంట సిద్ధం చేసుకుని వెళ్లానని, కానీ తాను తిరిగొచ్చేసరికి భర్త అదంతా తినేశాడని మండిపడింది. ఇక అతడితో వేగలేనని తేల్చేసి ఆమె విడాకులకు సిద్ధమైనట్టు చెప్పింది.

Viral: 18 ఏళ్లుగా పక్కింటి వ్యక్తి కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్టు తెలిసి షాక్!

ఇటీవల కాలంలో పలు అసాధారణ విడాకుల ఘటనలు కూడా సంచలనం సృష్టించాయి. సీసాలపై మూతలు తిప్పరాని విధంగా భర్త గట్టిగా బిగించడంతో ఓ మహిళ విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించింది. తాను వండి ఇచ్చిన వంటను తినకుండా భర్త ఆఫీసులో ఇతరులకు ఇచ్చేస్తున్నాడని తెలిసి విడాకులకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ మహిళ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Civil Aviation: విమానాలు గరిష్ఠంగా ఎంత ఎత్తులో ప్రయాణించగలవో తెలుసా?

Read Latest and Viral News

Updated Date - Sep 27 , 2024 | 03:22 PM