ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ప్రేమికులకు కోపం తెప్పించిన స్నేహితుడు.. తీరా లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అతను చేసిన నిర్వాకం..

ABN, Publish Date - Feb 02 , 2024 | 06:07 PM

ప్రేమికులు ప్రపంచంతో పని లేకుండా తమదైన ప్రపంచంలో విహరిస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ప్రేమికులు.. తమ జీవితంలోని మధున ఘట్టాలను ఫొటోలు, వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ముఖ్యంగా...

ప్రేమికులు ప్రపంచంతో పని లేకుండా తమదైన ప్రపంచంలో విహరిస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మంది ప్రేమికులు.. తమ జీవితంలోని మధున ఘట్టాలను ఫొటోలు, వీడియోల రూపంలో నెట్టింట్లోకి వదులుతుంటారు. ముఖ్యంగా లవ్ ప్రపోజ్ చేసే సందర్భాలను జీవితాంతం గుర్తుకుండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇలాంటి అరుదైన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇలాంటి సందర్భా్ల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కెమెరామెన్ నిర్వాకం చూసి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అతడు చేసి పని ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రేమ జంట (love couple) సినిమా సీన్ తరహాలోని అందమైన ప్రదేశంలో ఫొటోషూట్ (Photoshoot) పెట్టుకుంటుంది. ఓ ఇంటి ఆవరణలో రంగు రంగుల లైట్లు ఏర్పటు చేసి, వాటి మధ్యన నిలబడి తమ ప్రేమను వ్యక్తం చేయాలనేది వారి ప్లాన్. ఇందుకు తగ్గట్టుగానే అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రేమికులకు వారి స్నేహితుడు సలహాలు, సూచనలు ఇచ్చి కాస్త దూరంలో నిలబడి షూట్ చేస్తుంటాడు. అతడి సూచనల మేరకు ప్రేమికులు లవ్ ప్రపోజ్ చేసుకుంటుంటారు.

Viral Video: చుట్టూ ఐదు కుక్కలు, మధ్యలో భారీ నాగు పాము.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

ప్రేమికులు లవ్ ప్రపోజ్ చేసుకునే క్షణాలను తన కెమెరాలో బంధించాలని రెడీ అవుతాడు. అయితే ఇక్కడే ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. యువకుడు తీరా తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేసే సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తి తన కెమెరాను పక్కనే ఉన్న ఓ పిల్లి పైపు తిప్పుతాడు. దాన్ని వీడియో తీసిన తర్వాత మళ్లీ కెమెరాను ప్రేమికుల వైపు తిప్పుతాడు. అయితే అప్పటికే యువకుడు తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేసి కౌగిలించుకుంటాడు. లవ్ ప్రపోజ్ చేసే సమయాన్ని షూట్ చేయకుండా మిస్ చేసిన స్నేహితుడిపై ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఉన్నట్టుండి బరువెక్కిన ఫ్యాన్.. ఏంటా అని పైకి చూడగా.. దిమ్మతిరిగే సీన్..

Updated Date - Feb 02 , 2024 | 06:07 PM

Advertising
Advertising