Viral: మీ తెలివికో పరీక్ష! ఈ 2 బొమ్మల్లో 3 తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టగలరా?

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:04 PM

ఫోటో పజిల్స్, సుడోకు, ఛెస్ వంటి వాటితో బ్రెయిన్ పవర్ పెరుగుతుందని ఇప్పటికే రుజువైంది. దీంతో, ఎంటర్‌టైన్మెంట్ కూడా లభిస్తుంది. మరి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ పజిల్‌ను మీరూ ట్రై చేయండి!

Viral: మీ తెలివికో పరీక్ష! ఈ 2 బొమ్మల్లో 3 తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టగలరా?

ఇంటర్నెట్ డెస్క్: శరీరానికే కాదు మెదడుకు కూడా కసరత్తు అవసరం. మెదడుకు ఎంతగా పని చెబితే అంతగా రాటు దేలుతుంది. సవాళ్లు ఎదురైనప్పుడు వేగంగా పరిష్కారాలు వెతికే సామర్థ్యం పెరుగుతుంది. ఇక మెదడుకు పదును పెట్టుకునేందుకు పజిల్స్‌కు మించిన ప్రత్యామ్నాయాలు లేవు. ఛెస్, క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకూ వంటి వాటితో పాటు బొమ్మల్లో తేడాలు కనిపెట్టే పజిల్స్ వరకూ ప్రతి ఒక్కటి మెదడుకు కావాల్సిన ఉత్తేజాన్ని ఇస్తాయి. ఈ పజిల్స్‌కు పరిష్కారాలు కనిపెట్టే క్రమంలో ఏకాగ్రత, ఆలోచనా శక్తి, విషయాలను త్వరితంగా ఆకళింపు చేసుకునే నైపుణ్యాలన్నీ అలవడతాయి. అందుకే, నెట్టింట నిత్యం బొమ్మల పజిల్స్ వైరల్ (Viral) అవుతూ జనాలకు ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు మెదడుకు పదునుపెట్టుకునే అవకాశాలన్ని కల్పిస్తుంటాయి.

Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..


ప్రస్తుతం వైరల్ అవుతున్న పజిల్‌లో రెండు బొమ్మలు ఉన్నాయి. రెండు బొమ్మల్లోనూ సూక్ష్మమైన మూడు తేడాలు ఉన్నాయి. వీటిని కనిపెట్టేందుకు సమయం కేవలం 10 సెకెన్లే. అంటే..సగటున మూడు సెకెన్లలోనే ఒక తేడాను గుర్తించగలగాలి. ఈ స్వల్ప వ్యవధిలోనే బొమ్మలను క్షుణ్ణంగా పరిశీలించి తేడాను గుర్తించగలగాలి. దీనికి మంచి ఏకాగ్రత కూడా ముఖ్యం (Spot 3 differences between the mom and child pictures in 10 seconds).


Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!

ఇక ఈ ఫొటోల్లో ఓ మహిళ తన పిల్లాడిని ఒళ్లో కూర్చోపెట్టుకుని కూర్చీపై కూర్చుంది. ఎదురుగా టేబుల్..దానిపై లాప్ టాప్ ఉన్నాయి. ఈ రెండు బొమ్మల్లో తేడాలను మీరు ఇచ్చిన గడువు లోపల కనిపెట్టగిలిగితే మీ బ్రెయిన్ పవర్ గొప్పదని అన్నట్టే. అలా కుదరలేదంటే గనక కింద ఇచ్చిన బొమ్మను చూసి సమాధానం తెలుసుకోవచ్చు. మరో పజిల్‌లో మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవచ్చు.

Read Latest and Viral News

Updated Date - Oct 04 , 2024 | 12:10 PM