Opitcal Illusion: మీ కళ్లు ఎంతో షార్ప్ అయితే తప్ప.. ఈ ఫొటోలోని ``W`` ని కనిపెట్టలేరు.. ఓ సారి ప్రయత్నించండి!
ABN , Publish Date - May 31 , 2024 | 09:43 AM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో వరుసగా ``M`` అక్షరాలు ఉన్నాయి. వివిధ వరుసల్లో ఉన్న ఆ ``M``ల మధ్య వేరే అక్షరం కూడా ఉంది. ఆ అక్షరం ``W``. ఆ ``M``ల మధ్య ``W`` ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో ఆ అక్షరాన్ని కనిపెట్టాలి. చాలా తక్కువ మంది మాత్రమే ఈ టాస్క్‌లో విజయం సాధించారు. ఒకవేళ మీరు గనుక ఆ అక్షాన్ని కనిపెడితే మీ కళ్లు చాలా షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ ఫొటోలోని ``M``ల మధ్య ``W`` కనబడుతుంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..