Viral Video: షాకయిన జంట.. ఎందుకంటే..?
ABN, Publish Date - Jul 01 , 2024 | 04:39 PM
విన్నిపెగ్ నది పైన ఆకాశంలో ఎగిరే వస్తువు కనిపించింది. దానిని చూసి జస్టిన్ స్టీవెన్ సన్, డేనియల్ దంపతులు షాకయ్యారు. గుండ్రంగా.. పసుపు పచ్చని లైట్లతో రెండు కనిపించాయి. వాటిని చూస్తే సూర్యుని మాదిరిగా అనిపించాయి. కానీ సూర్యుడు కాదు.
ఏలియన్స్ ఉన్నాయా..? ఉంటే ఎక్కడ ఉన్నాయి..? నిత్యం ఏదో ఒక చోట గ్రహంతర వాసుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ సారి కెనడా వంతు వచ్చింది. ఓ జంట సుదూరంలో మిరుమిట్లు గొలిపేలా వింతగా కనిపించింది. అది ఏంటో అర్థం కాలేదు. ధైర్యం చేసి వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో గురించి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఎగిరే వస్తువు..
విన్నిపెగ్ నది పైన ఆకాశంలో ఎగిరే వస్తువు కనిపించింది. దానిని చూసి జస్టిన్ స్టీవెన్ సన్, డేనియల్ దంపతులు షాకయ్యారు. గుండ్రంగా.. పసుపు పచ్చని లైట్లతో రెండు కనిపించాయి. వాటిని చూస్తే సూర్యుని మాదిరిగా అనిపించాయి. కానీ సూర్యుడు కాదు. సైన్స్ ఫిక్షన్ మూవీలో ఉన్నట్టు ఉందని, ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తోందని స్టీవెన్ సన్ రాసుకొచ్చారు. అందులో ఉన్న కనిపించని అదృశ్య శక్తి ఏంటీ..? గ్రహంతర వాసులు కాదు కదా అని వివరించారు. దానిని చూసే సమయంలో సందేహాం కలిగింది. మనుషులు కాకుండా మరేదైనా ఉందా అనే సందేహాం కలిగిందని పేర్కొన్నారు.
ధైర్యవంతులు
స్టీవెన్ సన్ షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ‘ఓహ్.. మీరు చాలా ధైర్యవంతులు అని ఒకరు.. అదేంటి..? దానిని చూస్తే కొంచెం భయంగా ఉంది. తన ఇంటికి చాలా దగ్గరగా ఉంది అని ఇంకొకరు. అదొ విచిత్రమైన వస్తువులా అనిపిస్తోందని మరొకరు.. బెలూన్లలో లైట్ పెట్టి ఎగరేశారు.. అది అక్కడ చిక్కుకుంది అని’ నాలుగో నెటిజన్ కామెంట్స్ చేశారు. ఆ వీడియోపై ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అది ఏలియనా..? లేదంటే బెలూనా అనే అంశం తెలియాల్సి ఉంది.
Updated Date - Jul 01 , 2024 | 04:39 PM