ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: ఇది పాకిస్థాన్ అయ్యుంటే నిన్ను కిడ్నాప్ చేసుండేవాణ్ణి.. మహిళకు క్యాబ్ డ్రైవర్‌ షాక్!

ABN, Publish Date - May 17 , 2024 | 08:16 PM

కెనడాలో ఓ మహిళతో పాకిస్థానీ సంతతి ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది పాకిస్థాన్ అయ్యుంటే కిడ్నాప్ చేసుండేవాణ్ణి అంటూ అతడన్న మాటలు ఆమె రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో సంచలనానికి దారి తీసింది.

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో ఓ మహిళతో పాకిస్థానీ సంతతి ఉబెర్ క్యాబ్ డ్రైవర్ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారాయి. ఇది పాకిస్థాన్ అయ్యుంటే కిడ్నాప్ చేసుండేవాణ్ణి అంటూ అతడన్న మాటలు ఆమె రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో సంచలనానికి దారి తీసింది. అధికశాతం మంది క్యాబ్ డ్రైవర్‌పై దుమ్మెత్తిపోస్తే అతడు ఏ సందర్భంలో ఈ మాట అన్నాడో తెలుసుకోవాల్సి ఉందని కొందరు కామెంట్ చేశారు. టొరొంటోలో ఇటీవల ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వెనక సీటులోని మహిళవైపు తిరిగిన క్యాబ్ డ్రైవర్ పలు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ‘‘నువ్వు పాకిస్థాన్‌లో పుట్టి ఉంటే ఈపాటికి కిడ్నాప్ అయ్యిపోయి ఉండేదానివి’’ అని అన్నాడు. దీనికి నవ్విన ఆమె ‘‘నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావా?’’ అని ప్రశ్నించింది. ‘‘అవును నేనే కిడ్నాప్ చేస్తా. ఎందుకంటే నిన్ను దక్కించుకునేందుకు మరో మార్గం లేదు కదా. నువ్వు కెనడాలో ఉన్నావు కాబట్టి నిన్ను నేను ఏమీ అనలేను. టచ్ చేయలేను’’ అని అతడు చెప్పుకుపోయాడు. ఇదంతా రికార్డు చేసిన ఆమె నెట్టింట పంచుకుంది. ‘‘అతడు నన్ను పొగుడుతున్నాడేమో తెలీదు కానీ నేనైతే కాస్తంత భయపడ్డా’’ అని చెప్పుకొచ్చింది (Canada Uber Driver Tells Passenger He Would Have Kidnapped Her If It Was Pakistan).

Viral: గాఢ నిద్రలో కుక్క.. ఏనుగు వస్తున్నా లెక్క చేయలేదు.. చివరకు..


అయితే, ఘటన ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియరాలేదు. ఇక వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు పాకిస్థానీ క్యాబ్ డ్రైవర్‌పై మండిపడుతున్నారు. ‘‘అతడు జోక్‌గా అన్నా కూడా ఇటువంటి బెదిరింపులు సబబు కాదు, వెంటనే అతడిని తన దేశానికి పంపించేయాలి’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. మరికొందరు మాత్రం ఆచితూచి స్పందించారు. వీడియోలో మహిళ అతడి మాటలకు నవ్వుతున్న విషయాన్ని పేర్కొన్నారు. ‘‘పాకిస్థాన్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెబుతూ అతడు ఈ మాటలు అని ఉండొచ్చుగా? ఈ వీడియో అసంపూర్ణంగా ఉంది. అతడు ఏ సందర్భంలో ఈ మాట అన్నాడనేదానిపై స్పష్టత లేదు’’ అని మరొకరు కామెంట్ చేశారు. అధికశాతం మంది నెటిజన్లు మాత్రం క్యాబ్ డ్రైవర్‌పై దుమ్మెత్తిపోశారు.

Read Viral and Telugu News

Updated Date - May 17 , 2024 | 08:16 PM

Advertising
Advertising