ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Canada: భారతీయ మహిళలపై కెనడా వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 17 , 2024 | 05:51 PM

ప్రెగ్నెంట్ భారతీయ మహిళలు డెలివరీల కోసం కెనడాకు వస్తున్నారంటూ స్థానికుడు ఒకరు పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ప్రెగ్నెంట్ భారతీయ మహిళలు డెలివరీల కోసం కెనడాకు వస్తున్నారంటూ స్థానికుడు ఒకరు పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెనడాకు చెందిన ఛాడ్ ఎరోస్ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారు. స్థానిక ఆసుపత్రిలో ఓ నర్సు తన బంధువుకు చెప్పిన విషయాన్ని తాను సోషల్ మీడియాలో పంచుకుంటున్నట్టు చెప్పాడు (Viral).

Mike Tyson: మైక్ టైసన్ జీవితంలో ఆసక్తికర ఘటన! భారీ మగ గొరిల్లాతో ఫైట్‌కు సిద్ధమై..


‘‘ఆసుపత్రిలో ప్రసవాల వార్డు మొత్తం ఎప్పుడూ భారతీయ మహిళలతో నిండి ఉంటుందని ఆ నర్సు చెప్పింది. తమ బిడ్డలు కెనడా పౌరసత్వం పొందేందుకు భారతీయ మహిళలు ఇక్కడకొచ్చి ప్రసవిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. కెనడా ఆసుపత్రులు పేషెంట్లు ఎవరినీ తిప్పి పంపవు. భారతీయ మహిళలను కూడా చేర్చుకుంటాయి. ఇక్కడ పుడితే కెనడా పౌరుడు అవుతుంది కదా!’’

‘‘మరి ఈ డెలివరీలకు డబ్బు ఖర్చు అవుతుంది. ఈ బిల్లులను ఆసుపత్రి వర్గాలు భారతీయులకు ఇస్తారు కానీ వారి నుంచి డబ్బు ఎలా తీసుకుంటారు? భారతీయ మహిళలకు కెనడా హెల్త్ కేర్ సేవలు ఉండవు కదా! డబ్బు కట్టేంతవరకూ కెనడా వీడొద్దని కండీషన్ పెడతారా? వాస్తవానికి ఇలాంటి వారు బిడ్డతో సహా సొంత దేశానికి వెళతారు. ఆ తరువాత బిడ్డ పెద్దయ్యాక కెనడా పౌరుడిగా ఇక్కడికి తిరిగొస్తాడు. ఆ తరువాత అతడు తన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లకు వీసా స్పాన్సర్ చేస్తారు. వారికి ఈ సౌకర్యాలన్నీ ఉచితంగా లభిస్తుండగా భారం మాత్రం కెనడా పన్నుచెల్లింపుదార్లపై పడుతోంది’’ అని చెప్పుకొచ్చాడు.

Viral: అమ్మో.. సొర చేపపై స్వారీ.. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా


కొందరు మాత్రం అతడు ఈ మొత్తం విషయాన్ని చిత్రీకరించిన తీరును విమర్శించారు. ప్రభుత్వ అనుమతి ఉన్నంత కాలం ఇదంతా చట్టవ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కావాలనుకుంటే కెనడా ప్రభుత్వమే నిబంధనలు కఠినతరం చేయాలని సూచించారు. అనేక ఆసియా దేశాల వారు కూడా ఇలాగే చేస్తున్నారని మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏ ఒక్క దేశంపైనా నెపం పెట్టలేమని, కెనడా వ్యవస్థలోనే మార్పులు రావాల్సి ఉందని కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉధంతం వైరల్ అవుతోంది.

Viral: అసలైన ప్రేమంటే ఇదీ.. చూపు లేని గర్ల్‌ఫ్రెండ్‌కు ఊహించని సర్‌ప్రైజ్!

Viral: టాలెంట్ ఉన్నా లైఫ్‌లో ముందుకెళ్లట్లేదా? కారణాలు ఇవే!

Read Latest and Viral News

Updated Date - Nov 17 , 2024 | 06:04 PM