Viral: వింత ప్రతీకారం! భర్త చితాభస్మాన్ని తిన్న మహిళ!
ABN, Publish Date - Oct 08 , 2024 | 08:18 AM
భర్త చేసిన మోసం అతడి మరణం తరువాత బయటపడటంతో ఓ మహిళ ఆగ్రహంతో రిగిలిపోయింది. ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలనుకుని చివరకు అతడి చితాభస్మాన్ని తిన్నది.
ఇంటర్నెట్ డెస్క్: భర్త చేసిన మోసం అతడి మరణం తరువాత బయటపడటంతో ఓ మహిళ ఆగ్రహంతో రగిలిపోయింది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుని చివరకు అతడి చితాభస్మాన్ని తిన్నది. కెనడాలో వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది (Viral). తన భర్త చేసిన మోసాన్ని వివరిస్తూ ఆమె ఓ పుస్తకం కూడా రాసుకొచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, కెనడాకు చెందిన జెసికా వైట్ భర్త 2015లో మృతి చెందాడు. తదనంతరం, ఆమె అతడి ఫోన్ చెక్ చేస్తుండగా హ్యూస్టన్ ఎస్కార్ట్స్ కోసం అతడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్టు బయటపడింది. ఏమీటీ ఎస్కార్ట్స్ అని ఆరా తీయగా భర్త అక్రమ సంబంధం గురించి వెలుగులోకి వచ్చింది. భర్త ఇంత మోసానికి పాల్పడ్డాడని తెలిసి ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనై చివరకు ఎవరూ ఊహించలేని విధంగా ప్రతీకారం తీర్చుకుంది.
Viral: పోస్టు చేసిన 48 ఏళ్లకు వెనక్కొచ్చిన లేఖ! వృద్ధురాలికి సర్ప్రైజ్!
తన భర్త చితాభస్మం తాను దిగమింగుకున్న కన్నీళ్లతో కలిసి కడుపులోకి వెళ్లిపోయిందని ఆమె తన పుస్తకంలో రాసుకొచ్చింది. భర్త ఇంతటి దారుణానికి పాల్పడతాడని అస్సలు ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఓ రోజు అతడి గది సర్దుతుండగా భారీగా నీలి చిత్రాలు బయటపడ్డాయని ఆమె వివరించింది. తరచూ అర్ధరాత్రి తన గదిలో ఒంటరిగా గడిపే భర్త చేసేది ఇదని తెలిసి తనకు కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితంలోని చీకటి కోణం తెలిశాక ఎంతో ఆవేదన, భర్తపై పట్టరాని కోపం కలిగిందని చెప్పుకొచ్చింది. తన భర్తకున్న మరో కోణం తనను షాక్కు గురి చేసిందని చెప్పింది.
Viral: వామ్మో.. కోతి ముందు ‘జై శ్రీరామ్’ అంటే ఇలా జరుగుతుందా!? వైరల్ వీడియో
అతడి అన్యాయం గురించి తెలిశాక ప్రతీకారంతో రగిలిపోయిన ఆమె చివరకు ఎవ్వరూ ఊహించని విధంగా భర్త చితాభస్మాన్ని తిన్నది. అసలు తన భర్త అలాంటి పనులు చేయడానికి కారణమేంటో ఇప్పటికీ తెలియరాలేదని ఆమె పేర్కొంది. కానీ, అతడు తండ్రిగా, కొడుకుగా తన బాధ్యతలు చక్కగా నిర్వహించాడని చెప్పింది. సహోద్యోగులు అతడిని ఎంతో గౌరవిస్తారని పేర్కొంది. కానీ, ఈ చీకటికోణం ఎప్పటికీ అంతుబట్టని ఓ మిస్టరీగా మిగిలిపోయిందని చెప్పింది.
అయితే, తన కొడుకు కోసం తాను గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నానని, అతడికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పింది. తనను దహించి వేస్తున్న ఈ ఆగ్రహాన్ని తగ్గించుకునేందుకు కౌన్సెలింగ్ కూడా తీసుకున్నట్టు తెలిపింది. అయితే, భర్త చేసిన గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నానని, గతాన్ని మర్చిపోయి వాస్తవంలో బతికేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది.
Viral: ఈ వీధి వ్యాపారి ముందు టెకీలు కూడా దిగదుడుపే! ఇతడి రేంజ్ ఏంటో చూస్తే..
Viral: రూ.27 వేలకే ఐఫోన్ 16 కొనుక్కుని.. చివరకు విచారం! అసలేమైందంటే..
Updated Date - Oct 08 , 2024 | 08:32 AM