ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: మానవత్వం చచ్చిపోవడమంటే ఇదేనేమో.. కారు డ్రైవర్‌పై నెటిజన్ల ఫైర్..

ABN, Publish Date - May 19 , 2024 | 07:02 PM

నేటి ఆధునిక కాలంలో మనిషిలో మానవత్వం చచ్చిపోతుందనే మాట ఎక్కువుగా వింటూఉంటాం. కానీ ఒక్కో వ్యక్తి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఆ వ్యక్తిలో మానవత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఏదైనా బాధాకరమైన ఘటన జరిగినప్పుడు స్పందించే తీరు వ్యక్తి మానవత్వానికి కొలబద్దగా చెప్పుకోవచ్చు.

నేటి ఆధునిక కాలంలో మనిషిలో మానవత్వం చచ్చిపోతుందనే మాట ఎక్కువుగా వింటూఉంటాం. కానీ ఒక్కో వ్యక్తి ప్రవర్తన ఒక్కో విధంగా ఉంటుంది. వ్యక్తి ప్రవర్తన ఆధారంగా ఆ వ్యక్తిలో మానవత్వాన్ని అంచనా వేస్తుంటారు. ఏదైనా బాధాకరమైన ఘటన జరిగినప్పుడు స్పందించే తీరు వ్యక్తి మానవత్వానికి కొలబద్దగా చెప్పుకోవచ్చు.


సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టి్స్తోంది. కారు నడుపుతున్న వ్యక్తి పాలు తాగుతున్న కుక్కపిల్లను తొక్కించుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. నెమ్మదిగా వెళ్తున్న కారులోని వ్యక్తి ఎదురుగా కుక్క పిల్ల ఉందనే విషయాన్ని గమనించిన తర్వాత ఆగకుండా ముందుకు వెళ్లడంతో కారు డ్రైవర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూస్తుంటే.. కారు నడుపుతున్న వ్యక్తి కావాలనే కుక్కు పిల్లపై నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది.

Viral Video: వీళ్లకు పెళ్లంటేనే ఇష్టం లేనట్లుంది.. దండలు మార్చుకుంటున్న వధూవరులను చూస్తే..


మానవత్వం మరిచి..

తోటి మానవులు లేదా జంతువుల పట్ల కనికరం చూపించడాన్నే మానవత్వం అంటారు. ప్రస్తుత కాలంలో మానవత్వం లేకుండా పోతుందనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. సమాజంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే పక్కనుంచి వెళ్తున్న వ్యక్తులు అవతలివారిని పట్టించుకోకుండా వెళ్లిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అలాగే కావాలని ఎదుటివారికి కీడు చేసే ఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో‌ వైరల్ అవుతున్న ఓ వీడియో సరిగ్గా వ్యక్తిలో మానవత్వం లేకుండా పోతుందనడానికి నిలువెత్తు నిదర్శనం. ఓ వ్యక్తి కుక్కపిల్లపైనుంచి కారును నడిపించుకుంటూ వెళ్లడం ద్వారా కుక్క పిల్ల చనిపోతుంది.


ఉద్దేశపూర్వకంగానే చేశారా..

రోడ్డుపై కుక్కపిల్లకు తన తల్లి పాలు ఇస్తూ ఉంటుంది. కారులో వస్తున్న వ్యక్తి నెమ్మదిగానే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. కొంచెం దూరంలోనే కుక్క తన పిల్లకు పాలు ఇవ్వడం గమనించినట్లుగానే వీడియోలో కనిపిస్తోంది. కుక్క పిల్ల దగ్గరకు కారు చేరుకునే సమయానికి కారును ఆపకుండా ముందుకు వెళ్లసాగాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కుక్క పక్కకు వెళ్లగలిగింది. కుక్కపిల్ల మాత్రం కారు కింద పడి చనిపోయింది. ఈ బాధాకరమైన ఘటన ఎందరో నెటిజన్లను ప్రజలను కలిచివేసింది. ఒక వ్యక్తి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


ప్రజల రియాక్షన్ ఇదే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈవీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తూ కారు నడుపుతున్న వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం చాలా తప్పు.. అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టాలంటూ ఓ నెటిజన్ స్పందించాడు. అతడు మనిషి కాదు.. అతడిలో మానవత్వం చచ్చిపోయిందంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుత సమాజంలో మనుషుల్లో మానవత్వం ఎలా ఉందో తెలియజేయడానికి ఈ ఘటన దోహదపడుతుందంటూ మరికొందరు నెటిజన్లు స్పందించారు.


Viral Video: బీచ్‌లో యువతికి షాక్.. ఎద్దుకు ఆహారం పెట్టాలని చూడగా.. చివరకు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Viral and Telugu News

Updated Date - May 19 , 2024 | 07:02 PM

Advertising
Advertising