ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: పిల్లికి ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` అవార్డు.. దాని వెనుకున్న ఆసక్తికర కారణం ఏంటంటే..

ABN, Publish Date - May 20 , 2024 | 12:54 PM

అత్యంత గౌరవనీయమైన `డాక్టరేట్`` సాధించడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడి చదివితేనే గానీ అది సాధ్యం కాదు. లేదా ఏదైనా రంగంలో అద్భుతమైన కృషి చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. సామాన్యులకు ``డాక్టరేట్`` అనేది దక్కేది కాదు. అయితే ఓ పిల్లి తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకుంది.

Cat gets Doctor of Literature title

అత్యంత గౌరవనీయమైన డాక్టరేట్` (Doctorate) సాధించడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడి చదివితేనే గానీ అది సాధ్యం కాదు. లేదా ఏదైనా రంగంలో అద్భుతమైన కృషి చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. సామాన్యులకు ``డాక్టరేట్`` అనేది దక్కేది కాదు. అయితే ఓ పిల్లి (Cat) తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకుంది. అమెరికాలోని వేర్మొంట్ స్టేట్ యూనివర్సిటీ.. మాక్స్ డౌ అనే పిల్లికి గౌరవ ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` (Doctor of Literature) అనే బిరుదును ఇచ్చి సత్కరించింది. అంత ప్రఖ్యాత బిరుదును ఓ పిల్లికి ఎలా ఇస్తారనే అనుమానం వచ్చిందా? దాని వెనుక ఓ కారణముంది (Viral News).


వెర్మొంట్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద తన యజమానితో కలిసి మ్యాక్స్ డౌ అనే పిల్లి చాలా సంవత్సరాలుగా నివసిస్తోంది. ఈ పిల్లి చాలా స్నేహపూర్వకంగా, మర్యాదగా ప్రవర్తిస్తుందట. ఆ గేట్ గుండా వచ్చి పోయే వారితో సన్నిహితంగా మెలుగుతుందట. ఎన్నో సంవత్సరాలుగా ఆ యూనివర్సిటీ క్యాంపస్‌లో, తరగతి గదుల్లో, లైబ్రరీలో, క్యాంటిన్‌లో ఆ పిల్లి తిరుగుతోందట. కానీ, ఒక్కసారి కూడా ఆ పిల్లి వల్ల చిన్న ఇబ్బంది కూడా కలుగలేదట. యూనివర్సిటీలో విద్యార్థులు, లెక్చరర్లలోత స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ప్రేమను పొందిందట.


ఆ పిల్లి ప్రవర్తనను గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం దానిని సత్కరించాలని నిర్ణయించుకుంది. దానికి ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` అందించాలని నిర్ణయించుకుంది. వెంటనే డాక్టరేట్ సర్టిఫికెట్ అందించింది. ఇకపై మ్యాక్స్ డౌ కాస్తా డా.. మ్యాక్స్ డౌ అవుతుంది. తన పెంపుడు పిల్లికి అంత ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల దాని యజమాని షేల్ డౌ సంతోషం వ్యక్తం చేశాడు. క్యాంపస్‌లో అందరికీ మ్యాక్స్ తెలుసని, అందరూ దాని ప్రవర్తనను ఇష్టపడతారని షేల్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. హోరు గాలిలో ఘాట్ రోడ్‌లో జర్నీ ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ వీడియో చూస్తే..


Opitcal Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. ఈ ఫొటోలోని వ్యక్తి టోపీ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2024 | 12:54 PM

Advertising
Advertising