Viral: 20వ అంతస్తు గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన పిల్లి! ఎలా కాపాడారో చూస్తే..
ABN, Publish Date - Jun 21 , 2024 | 07:58 PM
ఇరవయ్యవ అంతస్తులోని గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన ఓ పిల్లిని బ్లూ క్రాస్ సంస్థ సిబ్బంది రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా సంస్థ సిబ్బందిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరవయ్యవ అంతస్తులోని గ్రిల్స్‌లో ఇరుక్కుపోయిన ఓ పిల్లిని బ్లూ క్రాస్ సంస్థ సిబ్బంది రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతుండగా సంస్థ సిబ్బందిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. చెన్నైలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
అపార్ట్‌మెంట్ 20వ అంతస్తులోని గ్రిల్స్‌లో పిల్లి ఇరుక్కుపోవడాన్ని అక్కడి వారు గుర్తించి అగ్నిమాపక శాఖతో పాటు బ్లూ క్రాస్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వెంటనే బ్లూ క్రాస్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు (Cat stuck in between grills of 20-storey Chennai building, dramatic rescue video).
Viral: ఇలాంటోళ్లతో ఎప్పటికైనా రిస్కే! బాయ్‌ఫ్రెండ్ పొరపాటుతో తిక్కరేగి..
అయితే, గ్రిల్స్‌ను చేరుకోవాలంటే టెర్రస్‌పై నుంచి కిందకు దిగడం మినహా మరో మార్గం లేదు. గ్రిల్స్ ఉన్న ప్రదేశం చాలా సన్నగా ఉండటంతో అక్కడి చేరుకోవడం కూడా కాస్తంత కష్టమే. ఇలాంటి పనిని బ్లూ క్రాస్ వారు చాకచక్యంగా పూర్తి చేసి పిల్లి ప్రాణాలు కాపాడారు. పెద్ద పెద్ద తాళ్ల సాయంతో వారు అపార్ట్‌మెంట్ టెర్రస్ పై నుంచి కిందకు దిగారు. పిల్లి ఉన్న చోటుకు చేరుకున్నాక దానికి మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అప్పటికే అది అక్కడ 12 గంటల పాటు చిక్కుకుపోయి ఉంది. పిల్లి సిబ్బందిపై దాడి చేసే అవకాశం ఉండటంతో ఇలా చేశారు. అనంతరం, పిల్లిని జాగ్రత్తగా బయటకు తీశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బ్లూ క్రాస్ సంస్థ నెట్టింట పోస్టు చేసింది. పిల్లిని కాపాడేందుకు వారు శ్రమ పడ్డ తీరు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజంగా అద్భుతమే చేశారంటూ అనేక మంది పొగడ్తల వర్షం కురిపించారు. మూగ జీవాల కోసం ఇంత సేవ చేయడం నిజంగా హర్షణీయమని కామెంట్ చేశారు. ఈ వీడియో నెటిజన్ల మనసును తాకడంతో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
Updated Date - Jun 21 , 2024 | 07:58 PM