Chennai: 78 నిమిషాలపాటు నిర్విరామంగా కర్రసాము...
ABN, Publish Date - Sep 10 , 2024 | 01:14 PM
నీలగిరి జిల్లా కున్నూరు వెలింగ్టన్ కంటోన్మెంట్ మైదానం(Cantonment Ground)లో జాతీయ కర్రసాము పాఠశాలల సమాఖ్య, వజ్రం క్రీడాభివృద్ధి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో కర్రసామును ప్రోత్సహించే విధంగా ప్రపంచ రికార్డు కోసం నిర్విరామ కర్రసాము ప్రదర్శన జరిగింది.
- ప్రపంచ రికార్డు సృష్టించిన 1200 మంది విద్యార్థులు
చెన్నై: నీలగిరి జిల్లా కున్నూరు వెలింగ్టన్ కంటోన్మెంట్ మైదానం(Cantonment Ground)లో జాతీయ కర్రసాము పాఠశాలల సమాఖ్య, వజ్రం క్రీడాభివృద్ధి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో కర్రసామును ప్రోత్సహించే విధంగా ప్రపంచ రికార్డు కోసం నిర్విరామ కర్రసాము ప్రదర్శన జరిగింది. వెలింగ్టన్ కంటోన్మెంట్ బోర్డు ఉన్నతాధికారి వినీత్ లోటే విశిష్ట అతిథిగా పాల్గొని ఈ ప్రదర్శన ప్రారంభించారు. రాష్ట్రం నలమూలల నుంచి వచ్చిన 1200 మంది విద్యార్థులు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జ్ఞప్తికి తెచ్చేలా 78 నిమిషాల పాటు నిర్విరామంగా కర్రసాము నిర్వహించి రాయల్ బుక్ ఆఫ్ వరల్డ్(Royal Book of the World) రికార్డులో స్థానం సంపాదించుకున్నారు. ఆ సందర్భంగా కర్రసాము జరిపిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమెంటోలను నిర్వాహకులు బహూకరించారు.
......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
........................................................................
Kamal Haasan: కృత్రిమ మేథోపరిజ్ఞానంపై అధ్యయనం కోసం ఆమెరికాకు కమల్..
- రెండు నెలలు అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు
చెన్నై: మక్కల్‌నీది మయ్యం నాయకుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథోపరిజ్ఞానం) కోర్సు చేయడానికి ఈ నెలాఖరున అమెరికా వెళ్తున్నారు. రెండు నెలలపాటు ఆయన ఆ కోర్సు అధ్యయనం చేయనున్నారు. అదే సమయంలో అమెరికా నుంచే ఆయన పార్టీ వ్యవహారాలు నడపాలని కూడా నిర్ణయించారు. ఇక ఈ నెల 21న పార్టీ సర్వసభ్యమండలి సమావేశం జరుగనుంది.
ఆ సమావేశానికి మండలి సభ్యులు 1400 మంది హాజరుకానున్నారు. ఆ సమావేశంలో కమల్‌ను మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నారు. ఈ సర్వసభ్యమండలి ముగియగానే ఆయన అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. డీఎంకే కూటమిలో కొనసాగుతున్న మక్కల్ నీదిమయ్యంకు గత లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యసభ సీటు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. ఆ మేరకు వచ్చే యేడాది కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కానున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 10 , 2024 | 01:14 PM